ప్రస్తుత వానాకాలం సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం 1.15 కోట్ల ఎకరాలు దాటింది. సాధారణ విస్తీర్ణం 1.16 కోట్లు. వ్యవసాయశాఖ బుధవారం ఈ వివరాలను ప్రకటించింది. పంటల వారీ సాగు వివరాలను ప్రభుత్వానికి అందజేసింది. సాధారణం కన్నా వరి 28, పత్తి 5.6, కంది 4.3, ఆహారధాన్యాలు 7.8 శాతం అదనంగా సాగుచేశారు. కీలకమైన నూనెగింజల పంటల సాగు తగ్గింది.
జూన్ 1 నుంచి బుధవారం వరకూ సాధారణ వర్షపాతం 549.8 మిల్లీమీటర్ల (మి.మీ.)కు గాను 644.8 కురిసింది. గతేడాది ఇదే కాలవ్యవధిలో 719.8 మి.మీ.లు పడింది. ఈ నెల 1 నుంచి బుధవారం వరకూ మాత్రం కురవాల్సిన దానికన్నా 44.27 శాతం తక్కువ వర్షం పడింది. మొత్తం 18 జిల్లాల్లో సాధారణంకన్నా ఎక్కువ వర్షాలు కురిశాయి. రంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల, ఖమ్మం జిల్లాల్లో సాగు 75 శాతంలోపే ఉంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ స్థాయిలో ఉంది.
ఇదీచూడండి: healthy food: ఇలా చేస్తే వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లకు చెక్!