సినీ నటి అంజలి హైదరాబాద్‌లో సందడి చేశారు. నగరంలోని కొత్తపేటలో ఓ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చేలా అన్ని వర్గాలకు గృహాలు నిర్మించి ఇవ్వడం శుభ పరిణామమని అంజలి అన్నారు.
ప్రస్తుతం తమిళ్, తెలుగు, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్నట్లు ఆమె తెలిపారు. త్వరలోనే పవన్‌కల్యాణ్ చిత్రం వకీల్‌సాబ్‌లో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నట్లు వెల్లడించారు.