హైదరాబాద్ నల్లకుంట డివిజన్లోని రత్ననగర్‌లో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్, కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్‌తో కలిసి వరద ముంపునకు గురైన బాధితులను పరామర్శించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఇంటికీ పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి అందించారు.
రత్ననగర్లోని బాధితులను ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ... తానున్నాననే భరోసా కల్పించారు. రత్ననగర్‌లో నష్టానికి కారణమైన నాలాకు రిటైనింగ్ వాల్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నల్లకుంట డివిజన్ సీనియర్ నాయకులు దూసర శ్రీనివాస్‌గౌడ్.. తన వంతు సహాయాన్ని రూ. లక్షను సీఎం రిలీఫ్ ఫండ్‌కు మంత్రి కేటీఆర్ అందజేశారు.
ఇదీ చూడండి: పోలీసుల త్యాగాలు అజరామరం, అనిర్వచనీయం: సీఎం కేసీఆర్