హైదరాబాద్ నాగోల్లోని సుప్రజ ఆసుపత్రిలో జ్యోతి(25) అనే వివాహిత మోకాలికి అరుదైన శస్త్రచికిత్స(rare surgery)ను విజయవంతంగా నిర్వహించామని వైద్యబృందం మీడియాకు తెలిపింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన జ్యోతికి పదేళ్ల క్రితం చీము రావటం వల్ల మోకాలు కీలు వంకరపోయిందని... దానిని గుర్తించి వైద్యులు శస్త్రచికిత్స చేశారు.
శస్త్రచికిత్స ద్వారా వంకరగా ఉన్న మోకాలిని యథావిధంగా అమర్చినట్లు వైద్యులు వెల్లడించారు. ఇటువంటి చికిత్సలు విజయవంతంగా కావడం చాలా అరుదని వారు తెలిపారు. ఎటువంటి ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్నా సుప్రజ ఆసుపత్రిలో సాంకేతిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ జలపతి రెడ్డిని ఆసుపత్రి యాజమాన్యం సన్మానించింది.
'చిన్న వయసులో మోకాలిలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల.. వయసు పెరిగే కొద్ది మోకాలు కీలు వంకరైంది. ఇలాంటి వాళ్లను అలాగే వదిలేస్తే మోకాలు అంత అరిగిపోయి.. భవిష్యత్లో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మేము దానిని గమనించి శస్త్రచికిత్స చేసి వంకరపోయిన కీలును సాధారణ స్థితికి తీసుకొచ్చాం. దీని వల్ల ఆమె ఇంకా 25 ఏళ్ల పాటు సాధారణంగా నడవగలుగుతుంది. ఇలాంటి సమస్యలు చాలా అరుదుగా వస్తుంటాయి. వాటిని మనం గమనించి వారిని ఆ ఇబ్బందుల నుంచి కాపాడొచ్చు.' -జలపతి రెడ్డి, వైద్యుడు
ఇదీ చదవండి: CM KCR speech in assembly: సకల జనుల సహకారంతో తెలంగాణలో హరితనిధి: కేసీఆర్