ETV Bharat / state

Shamshabad Airport: త్వరితగతిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ - telangana news

Shamshabad Airport: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ డిసెంబరు నాటికి పూర్తి అవుతుందని జీఎంఆర్​ యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటికే పూర్తయిన తూర్పు టెర్మినల్‌ నెలాఖరులోపు ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. వంద విమానాలు పార్కింగ్‌ ఉంచేందుకు వీలుగా రన్‌వే విస్తరణ, 34 మిలియన్ల ప్రయాణీకులు రాకపోకలు సాగించేందుకు వీలుగా మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

Shamshabad Airport: త్వరితగతిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ

author img

By

Published : Apr 6, 2022, 2:53 AM IST

Updated : Apr 6, 2022, 5:05 AM IST

త్వరితగతిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ

Shamshabad Airport: దేశంలో మొట్టమొదటిసారి పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యం నమూనాలో జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 2008లో మొదలైంది. అప్పట్లో కోటి 20లక్షల మంది విమాన ప్రయాణీకులు రాకపోకలకు సరిపడా సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. 2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాలల్లో ప్రయాణించిన విమాన ప్రయాణీకులు సగటును 20శాతం వృద్ధి నమోదు చేసింది. దీంతో శంషాబాద్‌ ఎయిర్​పోర్టు సామర్థ్యాన్ని 2019లో రెండు కోట్ల పది లక్షల మంది ప్రయాణాలు చేసేందుకు వీలుగా సౌకర్యాలను విస్తరించారు. ఏటికేడు అంతర్జాతీయ, డొమిస్టిక్‌ ప్రయాణీకుల సంఖ్య పెరగడంతోపాటు విమానాల రాకపోకలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

శరవేగంగా విస్తరణ పనులు.. గణనీయంగా పెరుగుతున్న విమాన ప్రయాణీకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టును జీఎంఆర్‌ యాజమాన్యం మరింత విస్తరిస్తోంది. తూర్పు, పశ్చిమ దిశల్లో మరో రెండు టెర్మినల్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 75విమానాలు పార్కింగ్‌ చేసుకోవడానికి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు రన్‌వే అనుకూలంగా ఉంది. విస్తరణ పనులు పూర్తి చేయడం ద్వారా వంద విమానాలు పార్కింగ్‌ చేసేందుకు సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. విస్తరణ పూర్తయితే 149 చెక్‌ఇన్‌ కౌంటర్లు, ఏటీఆర్‌ఎస్‌తో కూడిన 26 సెక్యూరిటీ స్క్రీనింగ్‌ మిషన్లు.. 44 ఎమిగ్రేషన్‌, 44 ఇమిగ్రేషన్‌ కౌంటర్లు కూడా అందుబాటులోకి వస్తాయని జీఎంఆర్‌ యాజమాన్యం తెలిపింది.

కాంటాక్ట్‌లెస్‌ ప్రయాణం కోసం.. మొదటి దశ విస్తరణలో భాగంగా ఇప్పటికే పూర్తయిన తూర్పు టర్మినల్‌ త్వరలో ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. ఈ టెర్మినల్‌ ద్వారా 15,742 చదరపు మీటర్లు వైశాల్యం కలిగిన నిర్మాణాలను ఇప్పుడున్న టెర్మినల్‌కు అనుసంధానం చేయనున్నారు. తక్కువ సమయంలో భద్రతా తనిఖీలు పూర్తి చేసుకునేందుకు వీలుగా కాంటాక్ట్‌లెస్‌ ప్రయాణం కోసం.. ఆరు ఈ గేట్‌లు ఏర్పాటు చేశారు. సురక్షితమైన కార్యకాలాపాలు, ఆటంకాలు లేని బ్యాగేజ్‌, గ్రౌండ్‌ సర్వీస్‌ ఎక్విప్‌మెంట్‌ వాహనాలు, ప్రయాణీకుల రాకపోకల కోసం విమానాల కదలిక సమయంలో రాకపోకలు సాగించడానికి వీలుగా.. 264 మీటర్లు పొడవున రన్‌వే మధ్యలో సొరంగ మార్గం నిర్మించినట్లు జీఎంఆర్​ యాజమాన్యం వెల్లడించింది.

పేపర్‌లెస్‌ ఈ బోర్డింగ్‌: దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పేపర్‌లెస్‌ ఈ బోర్డింగ్‌ సౌకర్యం కలిగిన ఏకైక విమానాశ్రయం హైదరాబాద్‌ విమానాశ్రయంగా జీఎంఆర్‌ యాజమాన్యం వెల్లడించింది. పర్యావరణ అనుకూల కార్యకలాపాలను నిర్వహించేందుకు పది మెగావాట్ల సోలార్‌ విద్యుత్తు ప్లాంట్‌, గ్రీన్‌ ప్యాసెంజర్‌ టెర్మినల్‌ భవనాలు, కార్బన్‌ ఉద్గారాలను తగ్గించేందుకు వీలుగా చర్యలు చేపట్టినట్లు జీఎంఆర్‌ యాజమాన్యం వెల్లడించింది.

ఇదీ చదవండి: రాష్ట్ర సర్కారుకు అన్ని రకాలుగా సహాయకారిగా ఉంటాం: సైనికాధికారులు

Last Updated : Apr 6, 2022, 5:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.