RGV TWEET: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘మహారాష్ట్రలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టికెట్ల ధర రూ.2,200 వరకు అనుమతించారు. ఏపీలో మాత్రం రూ.200కు అమ్ముకోవడానికి అనుమతుల్లేవు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లలో రూ.2,200 వరకు టికెట్లు విక్రయిస్తున్నారు’’ అని ఆర్జీవీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
సినిమా థియేటర్లలో టికెట్ల ధరలపై ఇటీవల ట్వీట్ల వర్షం కురిపించిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ.. మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. సినిమా టికెట్ల వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అయితే.. టికెట్ల ధరలపై తన అభిప్రాయం చెప్పడానికే తాను వచ్చానని ఆర్జీవీ అన్నారు. అదే సమయంలో ఇతరులు చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని అన్నారు.
' ఒక ఫిల్మ్ మేకర్‌గా మంత్రితో మాట్లాడేందుకు వచ్చా. సినిమా టికెట్ల ధరలపై నా అభిప్రాయం తెలియజేస్తా. ఇతరుల వ్యాఖ్యలపై నేను స్పందించను. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివి. తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది.'- రామ్‌గోపాల్ వర్మ
సినిమా థియేటర్లలో టికెట్ల ధరలపై ఇటీవల ట్వీట్ల వర్షం కురిపించిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ.. మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. సినిమా టికెట్ల వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే.. టికెట్ల ధరలపై తన అభిప్రాయం చెప్పడానికే తాను వచ్చానని ఆర్జీవీ అన్నారు. అదే సమయంలో ఇతరులు చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని అన్నారు.
' ఒక ఫిల్మ్ మేకర్‌గా మంత్రితో మాట్లాడేందుకు వచ్చా. సినిమా టికెట్ల ధరలపై నా అభిప్రాయం తెలియజేస్తా. ఇతరుల వ్యాఖ్యలపై నేను స్పందించను. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివి. తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది.'- రామ్‌గోపాల్ వర్మ
ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ ప్రశ్నలు..
RGV Comments: అంతకు ముందు సినిమా టికెట్ రేట్లు తగ్గించడాన్ని తప్పుబట్టిన వర్మ.. వరుస ట్వీట్లు చేశారు. మంత్రి పేర్ని నానికి కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చారు. ముడి పదార్థం రూ.500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్‌ని.. కొనేవాడుంటే ఐదు కోట్లకూ అమ్ముతారని అన్నారు. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే బ్రాండ్‌కి, ఆలోచనకు ఎలా వెలకడతారని ప్రశ్నించారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంకా బాగుండాలంటే ఏం చేయాలన్నది కొనుగోలుదారుడే నిర్ణయిస్తాడని తేల్చి చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్ ప్రభుత్వానికి తెలియకుండా చేసే నేరమన్న ఆర్జీవీ.. ప్రభుత్వానికి చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం కల్పించుకోవాల్సి విపరీత పరిస్థితి ప్రస్తుతం లేదని బదులిచ్చారు. పరస్పర అంగీకార లావాదేవీలకు లూటీ అనే పదం సరికాదని హితవు పలికారు. మొదటి నుంచి థియేటర్లు వ్యాపార సంస్థలు మాత్రమేనన్న ఆర్జీవీ.. ప్రజాసేవ కోసం ఎవరూ థియేటర్లు పెట్టలేదని స్పష్టం చేశారు. థియేటర్లనేవి ప్రజా కోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. కావాలంటే మీ గవర్నమెంట్లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి అన్నారు. మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి ఆ డెఫినిషన్(లూటీ) మీకు మీరు ఇచ్చుకుంటున్నారని ట్వీట్ చేశారు.
-
For those asking ,Inox insignia multiplex chain in the northern states sells tickets at Rs 2200
— Ram Gopal Varma (@RGVzoomin) January 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">For those asking ,Inox insignia multiplex chain in the northern states sells tickets at Rs 2200
— Ram Gopal Varma (@RGVzoomin) January 11, 2022For those asking ,Inox insignia multiplex chain in the northern states sells tickets at Rs 2200
— Ram Gopal Varma (@RGVzoomin) January 11, 2022
'వి ఎపిక్' థియేటర్‌కు ఏరియాను బట్టి టికెట్ రేటు ఎలా పెట్టారని ప్రశ్నించారు. టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని నిలదీశారు. పవన్ సినిమాకు సంపూర్ణేష్ సినిమాకి వ్యత్యాసం తెలియదా అని ప్రశ్నించిన రాంగోపాల్ వర్మ.. మంత్రిగా మీకు.. మీ డ్రైవర్‌కు కూడా తేడా లేదా? అని సూటిగా ప‌్రశ్నించారు.
అది అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరం
"వంద రూపాయల టికెట్.. వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదు. అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది. కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్పరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకు అవసరం. బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్‌కి తెలియకుండా చేసే క్రైమ్. ఓపెన్‌గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది." అన్నారు.
మీ పార్టీ కార్యకర్త.. మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు..
"థియేటర్లనేవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు. సొసైటీ ఆధునీకతకు ముఖ్య కారణం మోటివేషన్. ఎందుకంటే.. ప్రతి మనిషి కూడా మానవ సహజంగా తను ఉన్న పొజిషన్ కన్నా పైకి ఎదగాలని కోరుకుంటాడు. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు. మీ పార్టీ కార్యకర్త.. మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు. మీ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకుంటాడు." అని ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు.
పేదల్ని ధనికుల్ని చెయాలే కానీ.. ధనికుల్ని పేదలుగా చేయకూడదు..
"పేదల కోసం చేయడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు. అయితే.. పేదల్ని ధనికుల్ని చేయడానికి మీ ప్రభుత్వం పని చేయాలి కానీ.. ఉన్న ధనికుల్ని పేదల్ని చేయకూడదు. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముంది. నాని గారు.. నేను ఒక యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్‌ని.. ఎకనామిక్స్ గురించి నాకు ఏమీ తెలియదు. కానీ మీరు అనుమతిస్తే మీ ప్రభుత్వంలో ఉన్న టాప్ ఎకనామిక్స్ ఎక్స్‌పర్ట్‌తో నేను టీవీ డిబేట్‌కి రెడీ. మా సినిమా ఇండస్ట్రీకి మీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ ఈ వివాదాన్ని తొలగిపోవడానికి ఇది చాలా అవసరమని నా అభిప్రాయం" అని ట్వీట్లు చేశారు ఆర్జీవీ.