ETV Bharat / state

పీడీ యాక్ట్​ తొలగించేలా చర్యలు తీసుకోవాలి: గవర్నర్​కు రాజాసింగ్​ సతీమణి వినతి

Rajasingh wife met governor: రాజాసింగ్‌పై అక్రమ కేసులు కొట్టివేసేలా చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ సతీమణి ఉషాబాయ్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్​లో తమిళిసై సౌందర రాజన్‌ను కలిసిన ఆమె.. తన భర్తపై ఉన్న పీడీ యాక్ట్‌ తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Rajasingh wife met the governor
Rajasingh wife met the governor
author img

By

Published : Sep 18, 2022, 6:50 PM IST

Rajasingh wife met governor: గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అక్రమ కేసులు కొట్టివేసేలా చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ సతీమణి ఉషాబాయ్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు తన సోదరీమణులతో వెళ్లి తమిళిసై సౌందర రాజన్‌ను కలిసిన ఆమె.. రాజాసింగ్‌పై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించారని తెలిపారు. ప్రభుత్వ ఒత్తిడితోనే ఆయనపై హైదరాబాద్‌ పోలీసులు కేసులు బనాయించి అక్రమంగా నిర్భందించారని పేర్కొన్నారు.

న్యాయం కోసం కోర్టులో పోరాడుతున్నట్లు ఆమె గవర్నర్‌కు వివరించారు. తన భర్త విషయంలో గవర్నర్‌ జోక్యం చేసుకుని.. పీడీ యాక్ట్‌ తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రాజాసింగ్‌ను త్వరగా విడుదల చేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.