ETV Bharat / state

Rajagopal Reddy Clarifies on Party Change : 'కాంగ్రెస్​ నుంచి ఆహ్వానం వస్తున్న మాట నిజమే.. కానీ..' - రాజగోపాల్​ రెడ్డి విమర్శలు

Rajagopal Reddy Clarifies on Party Change : బీజేపీను వీడుతున్నట్లు కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నాయని బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కర్ణాటక ఫలితాలు చూపి కాంగ్రెస్‌లోకి రావాలని కొందరు మిత్రులు అడుగుతున్నారని ఆయన వెల్లడించారు. కర్ణాటక పరిస్థితులు వేరు, తెలంగాణ పరిస్థితులు వేరన్న రాజగోపాల్‌రెడ్డి.. రేవంత్ రెడ్డి వంటి వారు తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు.

Rajagopal Reddy
Rajagopal Reddy
author img

By

Published : May 18, 2023, 4:28 PM IST

Rajagopal Reddy Clarified on Party Change : బీజేపీని వీడి.. తాను కాంగ్రెస్​లో చేరుతానని వస్తున్న వార్తలను బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న సీఎం కేసీఆర్​ను గద్దె దించడానికే.. తాను బీజేపీలోకి వచ్చానని పునరుద్ఘాటించారు. ఈ మేరకు దిల్లీలో మాట్లాడిన ఆయన.. రేవంత్​రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా కర్ణాటక ఫలితాలను చూపించి.. కాంగ్రెస్​లోకి మళ్లీ రావాలని తమ మిత్రులు అడుగుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి తెలిపారు. బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక పరిస్థితులు వేరు.. తెలంగాణ పరిస్థితులు వేరని ఈ సందర్భంగా వివరించారు. తాను బీజేపీని విడిచి కాంగ్రెస్​లోకి వెళ్లే ప్రసక్తే లేదని.. కేవలం కేసీఆర్​ను గద్దె దించడానికే భారతీయ జనతా పార్టీతో దోస్తీ కట్టానని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రేవంత్​ రెడ్డి వంటి వారు తనపై దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దుష్ప్రచారంతోనే మునుగోడులో తనపై గెలిచారని ఆరోపించారు.

రేవంత్​రెడ్డి బ్లాక్​ మెయిల్​ చేసి కోట్లు సంపాదన..: రేవంత్​ రెడ్డి బ్లాక్​ మెయిల్​ చేసి రూ.కోట్లు సంపాదించారని.. ఆర్​టీఐను అడ్డం పెట్టుకొని బెదిరింపు రాజకీయాలు చేశారని రాజగోపాల్​ రెడ్డి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్​ నుంచి తనకు ఆహ్వానం వస్తున్న మాట నిజమేనని.. కానీ తాను కాంగ్రెస్​లో చేరడం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ గెలవక ముందే రాష్ట్ర కాంగ్రెస్​లో విభేదాలు వస్తున్నాయని.. పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను డబ్బుల కోసం అమ్ముడుపోయే వ్యక్తిని కాదని.. పోరాడే వ్యక్తినన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిపై ఎన్నో అపనిందలు వేశారని ఆవేదన చెందారు.

రేవంత్​ రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు తాను సిద్ధంగా లేనని రాజగోపాల్​ రెడ్డి తెలిపారు. తాము ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్​లో ఉన్నవాళ్లమని.. అయినా టీడీపీలో 20 ఏళ్లు ఉండి కాంగ్రెస్​లోకి వచ్చిన వ్యక్తితో తాను పని చేయాలా అని ప్రశ్నించారు. బెదిరింపు రాజకీయాలు చేసే వ్యక్తి చెప్పినట్లు విని నడుచుకోవాలా అని అన్నారు.

"నేను బీజేపీని వీడుతున్నట్లు కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక ఫలితాలను చూసి కొంత మంది మిత్రులు కాంగ్రెస్​లోకి రావాలని అడుగుతున్నారు. కర్ణాటక పరిస్థితులు వేరు.. తెలంగాణ పరిస్థితులు వేరు. రేవంత్​రెడ్డి వంటి నాయకుడు కాంగ్రెస్​లో ఉంటే నేను కాంగ్రెస్​లోకి రాలేను. బెదిరింపు రాజకీయాలు చేసే వ్యక్తితో పని చేయడం అసాధ్యం." -కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, బీజేపీ నేత

కర్ణాటక పరిస్థితులు వేరు.. తెలంగాణ పరిస్థితులు వేరు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.