యువత నైపుణ్యాల పట్ల అవగాహన పెంచుకోవాలని క్రియా సంఘ్ సొసైటీ ఛైర్మన్ షేక్ నయీం అన్నారు. సికింద్రాబాద్ రసూల్పూరాలో అభయ ఫౌండేషన్, శ్రీనివాస్ గౌడ్ ఫౌండేషన్ సహకారంతో యువజన సాధికారత కేంద్రాన్ని ప్రారంభించారు. డ్రైవింగ్, బ్యూటీషియన్స్, టైలరింగ్, మొబైల్ రిపేరింగ్ వంటి అనేక కోర్సులు ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు.
టైలరింగ్‌లో మూడు నెలలు,బ్యూటీషియన్‌గా 45 రోజులు, డ్రైవింగ్ కోసం 30 రోజుల పాటు శిక్షణ ఇస్తామని... అనంతరం వారికి ఉపాధి సైతం కల్పించేలా కృషి చేస్తామని క్రియా సంఘ్ సోసైటీ ఛైర్మన్ షేక్ నయీం తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కోర్సులను ఉచితంగా నేర్చుకునే సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సూర్యాపేటలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా