రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో వీస్తాయని ఐఎండీ తెలిపింది.
ఎల్లుండి కూడా వడగండ్లు మినహా ఇదే పరిస్థితి ఉండవచ్చని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈరోజు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్రఘట్టానికి 0.9కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ సంచాలకులు వివరించారు.
ఇదీ చూడండి: 'కబ్జాలకు పాల్పడ్డ మంత్రులందరిపై విచారణ చేపట్టాలి '