రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 23న బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. బుధవారం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని.. గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని వివరించింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది.
వర్షం కురిసే జిల్లాలు
21వ తేదీ: ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
22, 23 తేదీలు: ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వెల్లడించింది.
22, 23 తేదీల్లో నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ గ్రామీణం, వరంగల్ అర్బన్, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వివరించింది.
ఇదీ చదవండి: Industrial Corridors: వరంగల్, నాగ్‌పుర్ పారిశ్రామిక కారిడార్ల సాకారం ఎప్పుడో!