Rain in Hyderabad During Ganesh Idol Immersion : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం (Heavy Rains) కురిసింది. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ వర్షాల్లోనే గణేశుడి నిమజ్జనాలు(ganesh Immersion) కొనసాగుతున్నాయి. అలాగే సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, దోమలగూడ, కవాడిగూడ, భోలక్‌పూర్, గాంధీనగర్, రాంనగర్, అడిక్‌మెట్, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, సీతాఫల్మండి, బోయిన్పల్లి, ప్రకాశ్‌నగర్, రాణిగంజ్, ప్యారడైజ్.. తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ పైన వర్షంలో కూడా సామూహిక వినాయక విగ్రహాల ఊరేగింపు కొనసాగుతుంది.
కూకట్పల్లి ఐడీఎల్ చెరువు వద్ద వర్షానికి నెమ్మదిగా గణేశుని నిమజ్జనం ఊరేగింపు సాగుతోంది. నిజాంపేట్, ప్రగతినగర్, ఆల్విన్‌కాలనీ, కుత్బుల్లాపూర్, గుండ్ల పోచంపల్లి, హైదర్‌నగర్, పేట్ బషీరాబాద్, బహదూర్‌పల్లి, సూరారం, జీడిమెట్ల, సుచిత్ర, బాలానగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. అలాగే ముషీరాబాద్‌లో భారీ వర్షం పడిన.. వినాయక నిమజ్జనం ఊరేగింపు కొనసాగుతుంది.
Ganesh Idol Immersion at Hyderabad : హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ .. 040-21111111 లేదా 9000113667 నంబర్లకు కాల్ చేయాలని సూచించింది. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో, అలాగే నగరంలో వర్షానికి ప్రజానికం మొత్తం అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
Ganesh Immersion Continues Even in Heavy Rain in Hyderabad : హైదరాబాద్ నగరంలో ఒక పక్క వర్షం కురుస్తున్నప్పటికీ.. నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతోంది. బషీర్ బాగ్‌లో వర్షంలో కొనసాగుతున్న నిమజ్జన కోసం సాగర్‌కు గణనాథులు తరలి వెళుతున్నాయి. శోభాయాత్రకు భక్తుల పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వర్షం తాకిడికి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. ఏకధాటిగా వాన పడుతున్న డప్పు చప్పుడ్లు.. నృత్యాలు చేస్తూ.. నిమజ్జనాన్ని కొనసాగిస్తున్నారు. విభిన్న రకాల వినాయకుల భక్తులకు విశేషంగా ఆకట్టుకున్నాయి.
గురు, శుక్రవారంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం కూడా హైదరాబాద్‌లో భారీ వర్షం గంటసేపు కుమ్మేసింది. దీంతో ఎక్కడికక్కడ వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నుంచి వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చేసి.. తీవ్ర అవస్థలు పడ్డారు. మరోవైపు ఖైరతాబాద్‌లోని నాలాలో మొసలి పిల్ల బయటకు అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. భారీ వర్షం పడడంతో మురుగు నీరు రోడ్లపై ప్రవహించి.. దుర్ఘందమైన వాసన ప్రజలను ఇబ్బంది పెట్టింది.
Balapur Ganesh Immersion Completed At Tank Bund : ముగిసిన బాలాపూర్ మహా గణపతి నిమజ్జనం
Ganesh Nimajjanam 2023 : జైజై గణేశా.. బైబై గణేశా.. భాగ్యనగరంలో నిమజ్జనం సందడి