రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లపడింది. దాదాపు 130 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఒడిశాపై 150 మీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా.... ఆ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు సైతం ఉరుములు, ఈదురు గాలులతో వర్షాలు పడతాయని వెల్లడించింది. నిజామాబాద్, జనగాం, భద్రాద్రి, యాదాద్రి, ఖమ్మం నల్గొండ సహా మరికొన్ని జిల్లాల్లో వర్షం పడింది. రైతులు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. కొన్ని గ్రామాల్లో వరద ప్రవాహంలో ధాన్యం కొట్టుకుపోయింది.
11 గొర్రెలు మృత్యువాత
అకాల వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది ప్రాణాలు విడిచారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లోని లింగోజి గూడలో రైతు దంపతులు చనిపోయారు. వ్యవసాయ క్షేత్రంలోని చెట్టు కింద పనులు చేస్తుండగా పిడుగుపడి అక్కడిక్కడే మరణించారు. ఆత్మకూరులో 11 గొర్రెలు మృత్యువాత పడగా... కాపరికి తీవ్ర గాయాయ్యాయి. బొమ్మల రామారం మండలం మర్యాలకు చెందిన మన్నెరాములు పిడుగుపడి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందురు ప్రియాల్‌కు చెందిన రామయ్య, మంతూరుకు చెందిన యువరైతు నర్సింలుతో పాటు మెదక్ జిల్లా శంకరంపేటలోని ఇసుక బట్టీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు పిడుగుపాటుకు బలయ్యారు.
ఇదీ చూడండి : నేటి నుంచి రామయ్య సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు