హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి ధరణినగర్ వాసులు రసాయనాల నురుగు ఘాటుతో నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తమ నివాస పరిసర స్థలాల్లో ఈ రసాయన వాసనలతో కూడిన గాలితో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గాలికి ఎగిరి రసాయన నురుగు పిట్ట గూట్లకు అంటుకుంటుండటం వల్ల పిట్ట గూడులను పక్షులు వదిలి వెళ్తున్నాయి.
పక్షలు సైతం..
పక్షులు తమ గూడుల్లో ఉండాల్సినవి... రసాయనాల నురుగు వల్ల గూడులను వదిలి వెళ్లాల్సిన దీన స్థితి. బల్దియా అధికారులు స్పందించి నాలాల్లో పొంగి పొర్లుతున్న నురుగును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి : పరుగులు పెట్టిస్తున్న కలెక్టర్... అలసత్వం వహిస్తే షోకాజ్ నోటీస్