ఉత్పత్తి కేంద్రం నుంచి నేరుగా వినియోగదారుడికి సరకును అందించే విధానాన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. సికింద్రాబాద్ డివిజన్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా.. సిమెంట్‌తో కూడిన రేక్‌ను వినియోగదారుడి వద్దకు పంపింది.
మొదటి రేక్.. జగ్గయ్యపేటలోని ఓ సిమెంట్ ఉత్పత్తి కేంద్రం నుంచి పశ్చిమ బంగాలోని షాలిమార్, కోల్‌కతాకు బయలుదేరింది. కర్మాగారం నుంచి రైల్వేకు, రైల్వే నుంచి వేర్‌హౌస్‌కు, అక్కడి నుంచి డీలర్లు, చివరికి వినియోగదారుడి వద్దకు చేరే పరిస్థితి ఉండేదని.. ప్రస్తుత సదుపాయం ద్వారా సరఫరాదారుడు, వినియోగదారుడికి ఒకే స్టాప్‌తో కూడిన రవాణా సౌకర్యం అందుబాటులో వచ్చిందని రైల్వే అధికారులు తెలిపారు. రవాణా మార్గంలో సరకు రవాణా నష్టాన్ని తగ్గిస్తుందన్నారు.
ఇవీచూడండి: వేసవి ఆరంభంలోనే నిప్పులు కక్కుతున్న భానుడు