ETV Bharat / state

క్యాట్‌పేరు మీద సుప్రీం తీర్పును అడ్డుకుంటున్నారు: రఘనందన్‌రావు - Raghanandan on bureaucrats in state

Raghunandan Rao Fires on State Government: రాష్ట్రంలో అనేక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రఘనందన్​రావు ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో కూర్చున్న వ్యక్తులే అవి చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ క్యాడర్‌ అధికారులపై ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

Raghunandan Rao
Raghunandan Rao
author img

By

Published : Jan 20, 2023, 4:40 PM IST

Raghunandan Rao Fires on State Government: తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ క్యాడర్​కు చెందిన.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. బ్యూరోక్రాట్స్​కి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే.. అక్కడికి వెళ్లి పని చేయాలని అన్నారు. ఈ విషయం సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. కానీ 'క్యాట్' పేరు మీద సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా.. 15 మందిని పంపకుండా అడ్డుకున్నారని విమర్శించారు.

తెలంగాణలో అనేక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి: మాజీ సీఎస్​తో పాటే.. ఇతరులను కూడా వారికి కేటాయించిన స్థానాల్లో పంపించాలని రఘనందన్​రావు అందులో కోరారు. ముందుగానే చేస్తే చాలా తప్పిదాలు జరిగేవి కావు అన్నారు. డీజీపీని కూడా ఏపీ కేడర్​కు కేటాయించారని.. ఆయన్ని కూడా అక్కడికి పంపించాలనీ డిమాండ్ చేశారు. తెలంగాణలో అనేక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో కూర్చున్న వ్యక్తులే అవి చేపట్టడం సరికాదని హితవు పలికారు.

రంగారెడ్డి కలెక్టర్ అందరికీ ఒకే న్యాయం చేయరా?: మియాపూర్​లో సర్వే నెంబర్ 78కి సంబంధించిన భూమిని ఇతరులకు కేటాయించడంపై ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని రఘనందన్​రావు సూచించారు. 8 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి ఒక న్యాయం.. 40 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి మరో న్యాయమా అని నిలదీశారు. రంగారెడ్డి కలెక్టర్ అందరికీ ఒకే న్యాయం చేయరా అని ప్రశ్నించారు. ఈ అంశంపై చీఫ్ సెక్రటరీ చర్యలు తీసుకోవాలని రఘనందన్​రావు పేర్కొన్నారు.

దీనిపై సీఎస్​కు బహిరంగ లేఖ పంపిస్తున్నట్లు రఘనందన్​రావు తెలిపారు. తమకు ప్రభుత్వం, ప్రగతి భవన్ గేట్లు ఎలాగూ తెరుచుకోవని విమర్శించారు. కనీసం మీరైనా తమకు అవకాశం ఇస్తారో.. లేదో అని లేఖ పంపిస్తున్నాని అన్నారు. తమ లేఖను ఫిర్యాదుగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో సీఎస్ కార్యాలయానికి ఫోన్ చేసిన ఆయన.. సోమవారం నుంచి శుక్రవారం లోపు సమయం ఇవ్వాలని కోరారు.

'రాష్ట్రంలో అనేక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి'

"ఐఏఎస్​ అధికారులకు ఛాయిస్​ లేదు. బ్యూరోక్రాట్స్​కి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లి పని చేయాలి. ఈ విషయం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ 'క్యాట్' పేరు మీద సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా 15 మందిని పంపకుండా అడ్డుకున్నారు. మాజీ సీఎస్​తో పాటే ఇతరులను కూడా వారికి కేటాయించిన స్థానాల్లో పంపించాలి. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం." - రఘనందన్​రావు, ఎమ్మెల్యే

ఇవీ చదవండి: ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపుల వివాదంపై హైకోర్టు విచారణ వాయిదా

71వేల మందికి మోదీ 'జాబ్ లెటర్స్'​.. 16 కోట్ల ఉద్యోగాల సంగతేంటన్న కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.