సివిల్స్ సాధించిన విజేతలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సన్మానించారు. తన ఆధ్వర్యంలో ఉన్న రెండు గ్రూపుల్లో మొత్తం 97 మంది సివిల్స్ సాధించడం చాలా సంతోషంగా ఉందని మహేశ్ భగవత్ తెలిపారు. హైదరాబాద్ గ్రూపులో 41 మంది, మహారాష్ట్ర గ్రూపులో 56 మంది ఎంపికయ్యారని వివరించారు.
హైదరాబాద్, మహారాష్ట్ర గ్రూపుల్లో ఉన్న అభ్యర్థులకు మహేశ్ భగవత్ సలహాలు, సూచనలు ఇచ్చారు. మరికొంత మంది విద్యార్థులకు వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా శిక్షణనిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులు ఎల్కేజీ, యూకేజీలో ఉన్నప్పటి నుంచే సివిల్స్ సాధించాలంటూ పిల్లల్ని భయపెడుతున్నారని మహేశ్ భగవత్ తెలిపారు. ఈ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు.
మహేశ్ భగవత్ ఇచ్చిన శిక్షణ, స్ఫూర్తి వల్లే తాము సివిల్స్ సాధించగలిగామని విద్యార్థులు అన్నారు. రాత్రి మెసేజ్ చేసినా స్పందించి సందేహాలను నివృత్తి చేసేవారని తెలిపారు. తల్లిదండ్రులు ప్రోత్సాహం మహేశ్ భగవత్ లాంటివాళ్ల స్ఫూర్తి ఉంటే ఏదైనా సాధించగలమని స్పష్టం చేశారు.
సాధించాలన్న పట్టుదల, దాని కోసం ఎంతకైనా తెగించే శక్తి ఉన్నవాళ్లు ఏదైనా సాధించగలరని రాచకొండ సీపీ తెలిపారు.
ఇవీ చదవండి: హైదరాబాద్లో రూ.8 కోట్ల నగదు పట్టివేత