పీవీ శతజయంతి ఉత్సవాలు ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని... పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వేడుకలకు సంబంధించి శతజయంతి ఉత్సవ కమిటీ గాంధీభవన్‌లో సమావేశమైంది. మొదటిరోజు ఆర్థిక సంస్కరణలపై పీవీ చేసిన ప్రసంగాలను ప్రసారం చేయనున్నట్లు ఉత్తమ్ తెలిపారు.
ఇందిరా భవన్‌లో ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి ప్రసంగాలు వినేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జూమ్ యాప్ ద్వారా 1000 మంది వేడుకల్లో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ మంత్రి చిదంబరం, జైరాం రమేష్‌లు జూమ్ ద్వారా మాట్లాడతారని ఉత్తమ్ వివరించారు. ఈ సమావేశంలో ఎంపీ రేవంత్ రెడ్డి, చైర్మన్ గీతారెడ్డి, కన్వీనర్ మహేష్ గౌడ్, ఎమ్యెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: న్యూరో చికిత్స కోసం నానావతి ఆసుపత్రికి వరవరరావు