ETV Bharat / state

భరతనాట్య అరంగేట్రం చేసిన పురిఘళ్ల లక్ష్మీ ప్రణవ.. - భరత నాట్యం తాజా వార్తలు

పురిఘళ్ల లక్ష్మీ ప్రణవ భరతనాట్యంలో అరంగేట్రం చేశారు. తన నాట్యంతో అక్కడికి వచ్చిన వారిని కట్టిపడేశారు. దిల్లీలోని త్రివేణి కళా సంఘం ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Lakshmi Pranava
Lakshmi Pranava
author img

By

Published : Dec 16, 2022, 1:12 PM IST

Updated : Dec 16, 2022, 1:22 PM IST

దిల్లీలోని త్రివేణి కళా సంఘంలో నిత్యార్పణ సంస్థ ఆధ్వర్యంలో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిత్యార్పణ నిర్వాహకురాలు కోడై నారాయణన్​ సారథ్యంలో పురిఘళ్ల లక్ష్మీ ప్రణవ భరతనాట్య అరంగేట్రం చేశారు. ఆమె ప్రదర్శన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. లయబద్ధమైన భరతనాట్యంతో అలరిస్తూ వీక్షకుల కరతాళధ్వనులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్​రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్​, జార్ఖండ్ ఎంపీ సునీల్​ కుమార్ సింగ్​, సినీ నటుడు సాయికుమార్, సినీ నటి గౌతమి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఇవీ చదవండి: MLAs Poaching Case: సీఎం ప్రెస్‌మీట్ సీడీలు ఎక్కడివి.. పిటిషనర్లకు హైకోర్టు ప్రశ్న

డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ డ్యాన్స్ వీడియో వైరల్

Last Updated : Dec 16, 2022, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.