ETV Bharat / state

కరోనా బాధితుల నడ్డివిరుస్తున్న ప్రైవేటు పరీక్షా కేంద్రాలు - అధికంగా వసూలు చేస్తోన్న ప్రైవేటు పరీక్ష కేంద్రాలు

కరోనా ఆపత్కాలంలోనూ ప్రైవేటు పరీక్ష కేంద్రాలు బాధితులను దోచుకుంటున్నాయి. ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు రూ.2200 వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని ల్యాబ్‌ల్లో రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. రూ.50 ఉండే ఎక్స్‌రేకి రూ.500-1000 వరకు వసూలు చేస్తున్నారు.

కరోనా బాధితుల నడ్డివిరుస్తున్న ప్రైవేటు పరీక్ష కేంద్రాలు

author img

By

Published : Aug 1, 2020, 11:35 AM IST

కరోనా ఆపత్కాలంలోనూ మానవత్వం మచ్చుకైనా కనిపించకపోవడం పలువుర్ని బాధిస్తోంది. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన వారు సైతం ఒకింత భయం.. మరింత అనుమానంతో వైద్యులను సంప్రదిస్తున్నారు. వారి సిఫారసు మేరకు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించి సీటీ స్కాన్‌ చేయించుకుంటున్నారు. ఇలాంటి వారిని పలు ల్యాబ్‌లు నిలువు దోపిడీ చేస్తున్నాయి. ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం వల్ల భారీగా దండుకుంటున్నాయి. ఈ వ్యవహారం వైద్య ఆరోగ్య శాఖ దృష్టికెళ్లినా పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి.

హైదరాబాద్‌లో రోజూ వేలాదిగా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేస్తున్నారు. 30 శాతం ఫలితాల్లో అస్పష్టత ఉంటోంది. పాజిటివ్‌ వచ్చిన వారికి కరోనా నిర్ధరణ అయినట్లే. నెగెటివ్‌ వస్తే అది పాజిటివ్‌ కాదని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీ పీసీఆర్‌ పరీక్షల్లోనూ పది శాతం మంది ఫలితాల్లో లోపాలు వస్తున్నాయి. ఇలా నెగెటివ్‌ వచ్చిన అనేకమంది కరోనా లక్షణాలు అధికమై ఆసుపత్రి పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నెగెటివ్‌ వచ్చిన పలువురు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఇలాంటి వారిలో వైరస్‌ ఊపిరితిత్తులపై ప్రభావం చూపించి నిమోనియాగా మారి ఆక్సిజన్‌ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో అనుమానం ఉన్న అనేకమంది వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కరోనా లక్షణాలున్నాయని వైద్యులు గుర్తిస్తే హై రిజల్యూషన్‌ సీటీ స్కాన్‌ చేయించుకోమని సలహా ఇస్తున్నారు. తద్వారా ఊపిరితిత్తులపై వైరస్‌ ఎంత వరకు ప్రభావం చూపించిందన్న విషయమే కాకుండా ఆరోగ్య పరిస్థితినీ వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇలా రోజూ సీటీ స్కాన్‌ కోసం ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది ఎక్స్‌రేలు తీయించుకుంటున్నారు. రూ.50 ఉండే ఎక్స్‌రేకి రూ.500-1000 వరకు వసూలు చేస్తున్నారు.

సర్కార్‌ నిర్ణయిస్తేనే మేలు

ప్రైవేటు ల్యాబ్‌ల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు రూ.2200 వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని ల్యాబ్‌ల్లో రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. సీటీ స్కాన్‌కూ ఇలాగే ధర నిర్ణయించాలని పలువురు కోరుతున్నారు. అంతకుమించి వసూలు చేసే ల్యాబ్‌లు సీజ్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

నగరంలో ఇదీ దోపిడీ జరుగుతున్న తీరు

  • చిన్నా పెద్దా ల్యాబ్‌లు: సుమారు 300-500
  • సీటీ స్కాన్‌ రుసుము: సుమారు రూ.2 వేలు
  • కొన్ని ల్యాబ్‌లు వసూలు చేస్తోంది: రూ.8 వేల-12 వేల వరకు
  • అప్పటి కప్పుడే నివేదిక ఇవ్వాలంటే మరింత అదనం

ఆసుపత్రుల లోపలా అంతే!!

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికీ ఆక్సిజన్‌ సరఫరా తగ్గి కొందరి ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డం కడుతోంది. రక్తం గడ్డ కట్టిందా, కడితే పరిస్థితి ఎలా ఉందన్న విషయాలను తెలుసుకోవడం కోసం ఇలాంటివారికి సీటీ పల్మనరీ యాంజియోగ్రామ్‌ తీస్తున్నారు. ఈ పరీక్షకూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు భారీగా వసూలు చేస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పలువురు చెల్లించాల్సి వస్తోంది.

ఇదీ చదవండి: ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.