హైదరాబాద్ ధూల్‌పేటకు చెందిన ఓ గర్భిణి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. పది రోజుల క్రితం అమ్మాయి తండ్రి మరణించగా.. అంత్యక్రియలకు హాజరైంది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వారికి కరోనా సోకగా.. తండ్రికి కొవిడ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో గర్భిణీకి వైరస్ సోకగా చికిత్స కోసం గాంధీలో చేరారు.
కానీ తనకు సరైన చికిత్స అందకే మరణించిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. గర్భిణికి చికిత్స అందించాలని గోషామహల్ ఎమ్మెల్యే ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దైవంతో సమానంగా భావించే డాక్టర్లే ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. నిండు గర్భణి మృతికి వారి నిర్లక్ష్యమే కారణమా? లేక బాధితుల విజ్ఞప్తిని పట్టించుకోని సూపరింటెండెంట్దా? ఏదైతేనేమి రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి.
ఇదీ చూడండి: 'మార్కెట్లో అమ్ముడుపోయే పంటలే పండించాలి'