ETV Bharat / state

ప్రజావాణికి పోటెత్తిన జనం - ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై భూకబ్జా ఫిర్యాదు

Praja Vani Telangana Today : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ ఇంటి స్థలాలను కబ్జా చేస్తున్నారంటూ బేగంపేట బస్తీ వాసులు ప్రజా భవన్ ముందు ఆందోళన చేపట్టారు. దీన్నిసెల్‌ఫోన్‌లో వీడియో తీసిన దానం నాగేందర్ అనుచరుడిపై బాధితులు దాడి చేసి పోలీసులకు అప్పగించారు.

VRO Protest At Prajabhavan
Strike Against MLA Danam Nagendar At Praja Bhavan
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 3:22 PM IST

Strike Against MLA Danam Nagendar At Praja Bhavan ప్రజావాణకి పోటెత్తిన జనం ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై భూకబ్జా ఫిర్యాదు

Praja Vani Telangana Today : ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి (Prajavani Program) కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. దరఖాస్తులు ఇచ్చేందుకు జ్యోతిబాపూలే ప్రజాభవన్‌కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వానికి సమస్యలు విన్నవించుకునేందుకు నగరవాసులే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దరఖాస్తుదారులు వచ్చారు. భూ సమస్యల పరిష్కారం, పింఛన్ల కోసం ఎక్కువ మంది అర్జీదారులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఏళ్లుగా ఎటూ తేలని తమ సమస్యలు ఇప్పుడైనా పరిష్కారమవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ (MLA Danam Nagendar) తమ భూములు కబ్జా చేశారని బేగంపేట బస్తీ వాసులు పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. బాధితులను ఆందోళనను దానం నాగేందర్ అనుచరుడు నాగరాజు సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. దీన్ని చూసిన బాధితులు అతనిపై దాడికి దిగారు.

బేగంపేట ప్రకాశ్​నగర్ ఎక్స్‌టెన్షన్‌లో ఉంటున్న ఇళ్లను కబ్జా చేసి స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇక్కడికి వెళ్లినా తమ సమస్య పరిష్కారం కావడం లేదంటూ తమ గోడును వెల్లబోసుకున్నారు. ఇళ్ల దగ్గర రౌడీషీటర్లను పెట్టి భయపెడుతున్నారని బాధితులు వాపోయారు. దానం నాగేందర్ నాగరాజును పోలీసులకు అప్పగించిన బాధితులు సౌత్‌ జోన్ డీసీపీ విజయ్‌కుమార్‌కి తమ ఆవేదనను వినిపించారు.

ప్రజావాణికి అనూహ్య స్పందన - ప్రజాభవన్ వద్ద చలిలోనే క్యూ కట్టిన ప్రజలు

"మూడెకరాల్లో మా ఇళ్లున్నాయి. అవి కావాలని మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. పొద్దున సాయంత్రం రౌడీలను పెట్టి దౌర్జన్యం చేస్తున్నారు. దీని వెనకాల దానం నాగేందర్, వాళ్ల అనుచరులు ఉన్నారు. ప్రజాభవన్‌కు వచ్చి మా సమస్య చెప్పడానికి వస్తే వీడియోలు తీసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు." - బాధితులు

VRO Protest At Prajabhavan : మరోవైపు గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం వీఆర్ఏల సర్దుబాటు కోసం తెచ్చిన జీవో 81,85లను సవరణ చేసి 55 నుంచి 61 వయసుగల రుద్ర వీఆర్ఏ కుటుంబాలకు న్యాయం చేయాలని బాధితులు ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు విన్నవించుకున్నారు. గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు కోరారు.

ప్రజావాణికి పోటెత్తిన జనం - భూ సమస్యలే అధికం

అదే విధంగా తమకు హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ కోసం తిరుగుతున్నా మల్కాజిగిరి అధికారులు, ఎమ్మెల్యేను తమను పట్టించుకుకోవడం లేదని ఓ వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చినట్లు బాధితుడు తెలిపాడు. ఎక్కడ తిరిగినా తమ పని కావడం లేదంటూ, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమకు సర్టిఫికెట్ ఇవ్వాలని తమను ఆదుకోవాలని బాధితులు కోరాడు.

ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన - అర కిలోమీటర్ వరకు బారులు తీరిన అర్జీదారులు

ప్రజావాణి - ముఖ్యమంత్రి ముద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.