ETV Bharat / state

అత్యాచారం కేసులో యూట్యూబ్​ స్టార్​ చంద్రశేఖర్​ అరెస్టు - ప్రేమించిన అమ్మాయిని మోసగించిన యూట్యూబర్​ చందు

Popular YouTuber Chandrasekhar Arrest in Rape Case : ప్రముఖ యూట్యూబర్​ యువతిని ప్రేమించి, చివరికి పెళ్లి విషయానికి వచ్చేసరికి నో చెప్పాడు. చివరకి బాధితురాలి ఫిర్యాదుతో యూట్యూబర్​ చంద్రశేఖర్​ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్​లో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూట్యూబర్​పై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, రిమాండ్​కు తరలించారు.

Popular YouTuber Chandrasekhar
Popular YouTuber Chandrasekhar Arrest in Rape Case
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 4:33 PM IST

Updated : Dec 15, 2023, 4:44 PM IST

Popular YouTuber Chandrasekhar Arrest in Rape Case : ఈ ఇంటర్​ నెట్​ యుగంలో సోషల్​ మీడియా హవా అంతా ఇంతా కాదు. ఆ సోషల్​ మీడియాలో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ ఫేమస్​ అయిన వ్యక్తులు ఎంతమందో ఉన్నారు. వారిలో ముఖ్యంగా ఎక్కువమంది వీక్షించే యూట్యూబ్(Youtube)​లో ప్రాముఖ్యం సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ప్రస్తుత కాలం యువత కూడా వారినే ఫాలో అవుతూ, వారు ఏ వీడియోలు చేసిన కచ్చితంగా చూసి తీరుతున్నారు. వారి వీడియోలను చూస్తూ వారి ఫ్యాన్​ ఫాలోయింగ్​కు ఫిదా అయి కొంత మంది అమ్మాయిలు యూట్యూబర్స్​ వలలో పడుతున్నారు.

వారితో ప్రేమాయణం సాగించి, చివరకు పెళ్లి అనే విషయం వచ్చేసరికి యూట్యూబ్​ స్టార్స్​ చెక్కేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా హైదరాబాద్​లో ఓ ప్రముఖ యూట్యూబర్ చంద్రశేఖర్(చందుగాడు)​​, యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. చివరికి ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో యూట్యూబర్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

YouTuber Chandu Gadu : యూట్యూబ్​ చందుగాడు పేరుతో ఫేమస్​ అయిన చంద్రశేఖర్​ సాయి కిరణ్(Chandu Gadu)​ ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసిందని నార్సింగి పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు అత్యాచారం, మోసం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2021 ఏప్రిల్​ 25న పుట్టిన రోజు వేడుకలకు యువతిని ఆహ్వానించి అత్యాచారానికి చంద్రశేఖర్​ పాల్పడినట్లు తెలిపారు. నిందితుడిపై 420, 376(2), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. యూట్యూబర్​ చంద్రశేఖర్​తో పాటు ఆయన తల్లిదండ్రులు, మరో ఇద్దరిపై కూడా కేసులు నమోదు అయ్యాయి. నిందితుడు చంద్రశేఖర్​ను అరెస్టు చేసి నార్సింగి పోలీసులు రిమాండ్​కు తరలించారు.

పుష్ప సినిమాలో కేశవపై కేసు నమోదు : పుష్ప సినిమా(Pushpa Movie)లో సహనటుడిగా నటించిన కేశవ అలియాస్​ జగదీశ్​ ఆలీపై ఈనెల 6వ తేదీన కేసు నమోదు అయింది. ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడంలో కేశవ(మచ్చా) పాత్ర ఉందని పోలీసులు అతనని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. గత నెల 27వ తేదీన ఓ మహిళ వేరే వ్యక్తితో ఉండడాన్ని సెల్​ఫోన్​లో రికార్డు చేసి ఆమెను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కేశవ వేధింపులు భరించలేక జూనియర్​ ఆర్టిస్టు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

యువకుడిని బలి తీసుకున్న ప్రేమ - రహస్య భాగాలపై కారం కొట్టి దారుణ హత్య

Women Safety Tips Telugu : అమ్మాయిలపై 'ప్రేమ' దాడులు.. అమ్మానాన్న ఎలా కాపాడుకోవాలంటే..?

Last Updated : Dec 15, 2023, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.