తెరాస ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని భాజపా నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా... రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వటంలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రైతుబంధు పథకం పేరు చెప్పి హడావుడి చేసిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు ఆ నిధులు కూడా ఇవ్వటంలేదని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి పేరు వస్తుందనే అక్కసుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడంలేదని విమర్శించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కిసాన్ సమ్మాన్ నిధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కేసీఆర్ సొంత గ్రామానికి రూ.10కోట్ల ప్రత్యేక నిధులు