ETV Bharat / state

ఐదు మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న పోలింగ్​ - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్రంలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్‌, సిద్దిపేటలో ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీటితో పాటు వివిధ మున్సిపాలిటీల్లోని వార్డులకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

MUNICIPALITIES
MUNICIPALITIES
author img

By

Published : Apr 30, 2021, 2:28 PM IST

మినీపురపోరులో భాగంగా... మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు, నల్గొండ జిల్లా నకిరేకల్‌, సిద్దిపేట మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభం కాగా మొదట్లో మందకొడిగానే కొనసాగింది. 8 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మాస్కు ధరించిన ఓటర్లను మాత్రమే పోలింగ్ కేంద్రాలకు అనుమతిస్తున్నారు.

బాదేపల్లి ప్రభుత్వ పాఠశాలలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం లోపల భౌతిక దూరం పాటించేలా చర్యలు ఉన్నా... పోలింగ్ కేంద్రం బయట పార్టీల శ్రేణులు గుంపులుగా కనిపిస్తున్నారు.

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో 20 వార్డులకు గానూ... 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు ఉదయం నుంచే జనం... ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. సిద్దిపేట మున్సిపాటీలోని 43 వార్డుల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంత్రి హరీశ్​ రావు, ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నల్గొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్‌లో ఒక్కో వార్డుకు ఉపఎన్నిక జరుగుతోంది. మెట్‌పల్లి, అలంపూర్‌, జల్పల్లి, గజ్వేల్‌లోని ఒక్కో వార్డుతో పాటు జీహెచ్​ఎంసీలోని లింగోజిగూడ డివిజన్‌కు ఉపఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: పోలింగ్​ సజావుగా సాగుతోంది: ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.