ETV Bharat / state

కొవిడ్​ నిబంధనల మధ్య కొనసాగుతోన్న మినీ పుర పోలింగ్​ - mini municipal corporation elections polling started

రాష్ట్రంలో మినీ పురపోరుకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. వరంగల్, ఖమ్మం నగరపాలికలతోపాటు మరో ఐదు పురపాలికలకు పోలింగ్‌ జరుగుతోంది. కరోనా విజృంభిస్తున్నందున కొవిడ్‌ నిబంధనలు పాటించి ఓటింగ్‌లో పాల్గొనేలా అధికారులు చర్యలు చేపట్టారు. పోలింగ్‌కు వచ్చే ఓటర్లు తప్పనిసరిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించేలా పర్యవేక్షిస్తున్నారు.

polling-begins-for-mini-municipal-corporation-elections-in-the-state
కొవిడ్​ సమయంలో కొనసాగుతోన్న మినీ పుర పోలింగ్​
author img

By

Published : Apr 30, 2021, 7:00 AM IST

Updated : Apr 30, 2021, 11:31 AM IST

మినీ పురపోరుకు పోలింగ్‌ కొనసాగుతోంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూర్, నకిరేకల్ మున్సిపాలిటీలకు పోలింగ్‌ జరుగుతోంది. నల్గొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్, మెట్‌పల్లి, జల్‌పల్లి, గజ్వేల్ మున్సిపాలిటీల్లోని ఒక్కొక్క వార్డుకు జరుగుతున్న పోలింగ్‌లో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.

ఓరుగల్లులో పురపోరు

వరంగల్‌ కార్పొరేషన్‌లో 66 డివిజన్లకు సంబంధించి 878 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6 లక్షల 63వేల 240 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 46 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ క్యాస్టింగ్ చేస్తుండగా.. 561 కేంద్రాల్లో సీసీటీవీల ద్వారా పోలింగ్‌ను రికార్డు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఖమ్మం కార్పొరేషన్‌లో..

ఖమ్మం కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లకు పోలింగ్‌ జరుగుతోంది. 377 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2లక్షల 88వేల 929 మంది ఓటర్లు ఓటువేయనున్నారు. 60 డివిజన్లలో జరిగే ఎన్నికల్లో మొత్తం 251 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 131 మంది మహిళా అభ్యర్థులు, 120 మంది పురుషులు బరిలో నిలిచారు. ఒక్కో డివిజన్‌లో మూడు నుంచి ఆరు వరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 63 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ దాదాపు 1700 మంది సిబ్బందితో బంబోబస్తు ఏర్పాటు చేసింది. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నందున ఎన్నికల్లో కొవిడ్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పక్కాగా కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షిస్తు‌న్నారు. ప్రతి కేంద్రంలో విధుల్లో పాల్గొనే బృందానికి కిట్లు అందించారు.

నకిరేకల్‌ మున్సిపాలిటీలో..

నకిరేకల్‌ మున్సిపల్‌లో ఓటింగ్​ కొనసాగుతోంది. 40 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. మేజర్ గ్రామ పంచాయితీ నుంచి కొత్తగా ఏర్పడిన నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీలో తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. నకిరేకల్ సమీపంలోని ఏడు గ్రామాలను మున్సిపాలిటీలోకి విలీనం చేసి 20 వార్డులు ఏర్పాటు చేశారు. మొత్తం 21వేల 382 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. 20 వార్డులకుగాను 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సిద్దిపేట బల్దియా ఎన్నికలు ప్రశాతంగా సాగుతున్నాయి. 43వార్డులకు గాను 236మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 130పోలింగ్ కేంద్రాల్లో లక్షా 678మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 32 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనంగా పోలీసులను మోహరించారు. గజ్వేల్‌లోని 12వ వార్డుకు సైతం ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలికలో పోలింగ్ జరుగుతోంది. జడ్చర్ల మున్సిపాలిటీలోని 27వార్డుల్లో 41వేల 515 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 27వార్డుల్లో మొత్తం 112 మంది అభ్యర్ధులు పోటీ చేశారు. అచ్చంపేట పురపాలికలోని 20వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 20వేల 529 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

కొత్తూరు పురపాలిక పోరులో..

రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలికలో ప్రశాంతంగా ఓటింగ్​ జరుగుతోంది. 12 వార్డులకు జరిగే ఎన్నికల్లో 8వేల 136 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. 12 వార్డులకుగాను 47 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో 5వ వార్డుకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నామపత్రం దాఖలు చేసిన ఏకైక అభ్యర్ది ఎరుకలి లక్ష్మీదేవమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇదీ చూడండి: ఎగ్జిట్‌ పోల్స్​: నాగార్జునసాగర్​లో తెరాసకు 50.48 శాతం ఓట్లు

Last Updated : Apr 30, 2021, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.