ETV Bharat / state

Hyderabad Drugs Case: 'సార్..​ నేను హైదరాబాద్​ రాలేదు.. ఆ ఫొటో నాది కాదు'.. చివరికి.. - డ్రగ్​ డీలర్​ టోనీ వార్తలు

Hyderabad Drugs Case:సంచలనంగా మారిన పంజాగుట్ట డ్రగ్స్‌ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. అంతర్జాతీయ డ్రగ్స్‌ సరఫరాదారుడు టోనీ నుంచి... పోలీసులు కీలక ఆధారాలు రాబట్టారు. మొదట తాను హైదరాబాద్ రాలేదని బుకాయించిన టోనీతోనే... నిజం చెప్పించారు. అతనిచ్చిన సమాచారంతో మరికొంత మంది నిందితులను.. ముంబయిలో అరెస్టు చేసి హైదరాబాద్​కు తీసుకువచ్చారు.

Hyderabad Drugs Case
Hyderabad Drugs Case
author img

By

Published : Feb 5, 2022, 5:39 AM IST

Hyderabad Drugs Case: పంజాగుట్ట డ్రగ్స్‌ కేసులో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన టోనీ.. చివరకు నేరం అంగీకరించాడు. ‘‘సార్‌.. నేను హైదరాబాద్‌ రాలేదు.. మీరు చెబుతున్న ఫోటో నాది కాదు... నైజీరియన్లంతా కొంచెం అటూ ఇటూ నాలాగే ఉంటారు.. కొకైన్‌ విక్రయిస్తున్నాను.. నా ఏజెంట్లను కూడా కలవను.. నాకు ఇక్కడ ఎవరూ తెలీదు.. ముంబయిలో ఉంటున్నా చాలా తక్కువమందితో మాత్రమే ఇంటర్నెట్‌ ద్వారా మాట్లాడుతుంటా.. ముంబయి.. హైదరాబాద్‌ నగరాల్లో కొకైన్‌ను అమ్మేందుకు హిందీ నేర్చుకున్నా.. కొకైన్‌ విక్రయించగా.. నాకు వేలల్లో మాత్రమే మిగులుతుంది.. నాకు తెలిసింది ఇంతే..” పోలీసుల విచారణలో కొకైన్‌ విక్రేత టోనీ.. ఐదురోజుల విచారణలో అన్నమాటలివి. కొకైన్‌ సరఫరా చేసే స్టార్‌ బాయ్, హైదరాబాద్‌లో వినియోగదారుల గురించి ఎంత ప్రశ్నించినా టోనీ సమాధానాలు చెప్పలేదు. టోనీ వ్యవహారశైలిపై ముందు నుంచీ అనుమానంగా ఉన్న ఓ పోలీస్‌ ఉన్నతాధికారి మాత్రం.. అతడి గురించి వివరాలు సేకరించారు. టోనీ డ్రగ్స్‌ క్రయవిక్రయాలపై పూర్తి సమాచారం సేకరించారు. ఐదోరోజు విచారణలో ఒక్క ఫోటో చూపించి నిజం ఒప్పుకొనేలా చేశారు.

ఇలా దొరికేశాడు..

ముంబయిలో ఉంటున్న టోనీ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వివరాలను పోలీసు ఉన్నతాధికారికి చూపించారు. నాలుగైదు ఫోన్‌ నంబర్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఆ అధికారి... రెండు ఫోన్‌ నంబర్ల సమాచారం సేకరించారు. రెండున్నరేళ్ల క్రితం ఆ ఫోన్‌ నంబర్ల నుంచి టోనీకి ఫోన్లు వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానంతో వారి సంభాషణలను తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. వారు వీడియోకాల్‌ ద్వారా మాట్లాడినట్టు తెలిసింది. దీంతో ఆ వివరాలను తెప్పించుకున్నారు. గోల్కొండలో తాము ఉన్నట్టు.. 250 గ్రాముల కొకైన్‌ తమవద్ద ఉందంటూ ఇద్దరు నైజీరియన్లు టోనీతో వీడియోకాల్‌లో మాట్లాడారు. టోనీ అప్పుడు హైదరాబాద్‌లో మరో ప్రాంతంలో ఉన్నాడు. ఆ వీడియోకాల్‌ రికార్డ్‌ను సాంకేతిక పరిజ్ఞానంతో ఫోటోలు తీయించారు. అందులోని ఒక్క ఫోటోను పోలీస్‌ ఉన్నతాధికారి టోనీకి చూపించగానే.. తానేనంటూ ఒప్పుకొన్నాడు. గోల్కొండ, నాంపల్లి ఎక్సైజ్‌ పోలీసులు తన అనుచరులను అరెస్ట్‌ చేశారని.. తాను తప్పించుకుని పారిపోయానని పోలీసులు ఎదుట టోనీ అంగీకరించాడు.

ఈ డ్రగ్స్‌ కేసులో... ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. టోని ఇచ్చిన సమాచారం మేరకు... అతనికి సహకరించిన వారిని పోలీసులు ముంబయిలో గుర్తించారు. ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న ఆసిఫ్, అహ్మద్‌ ఖాన్, ఇర్ఫాన్‌లను అరెస్టు చేశారు. అనంతరం వారిని నాంపల్లిలోని 14వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.

ఇదీచూడండి: డ్రగ్స్​ కేసులో టోనీ ఏజెంట్లు ముగ్గురు అరెస్ట్​.. రిమాండ్​కు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.