Police Notice to Bigg Boss Owners : బిగ్ బాస్ యాజమాన్యానికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో హంగామా చేశారు. విజేతను నిర్ణయించడం కంటే ముందే విజేత పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్‌దీప్ చౌదరి అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో విజేతగా బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ తన కారుపై నిల్చుని అభిమానులకు అభివాదం చేశాడు. అయితే అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలని పోలీసులు సూచించినా పట్టించుకోలేదు.
బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు - 14 రోజుల పాటు రిమాండ్
Bigg Boss 7 Clash Update : మరోవైపు అభిమానలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అమర్‌దీప్, గీతూ రాయ్, పోలీసుల కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పల్లవి ప్రశాంత్‌తో పాటు మరికొందరిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మొత్తం రెండు కేసుల్లో 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఘటనకు బాధ్యులుగా బిగ్‌బాస్ యాజమాన్యం ఎండమోల్‌షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు(Notice on Bigg Boss Show Management) జారీ చేశారు. అభిమానులు గుమిగూడినా సమాచారం ఎందుకు ఇవ్వలేదని, భారీగా అభిమానులు వస్తారని తెలిసినా ముందస్తుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని నోటీసుల్లో పేర్కొన్నారు.
పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు - నేడు జైలు నుంచి విడుదల
Pallavi Prasanth Case Update : డిసెంబర్ 17న బిగ్‌బాస్ షో 7వ సీజన్ విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించింది. అనంతరం ఆ రాత్రి జరిగిన వాగ్వాదంలో 6 ఆర్టీసీ బస్సులు, పలు కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించి బిగ్‌బాస్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరవాత ఆర్టీసీ అధికారులను బిగ్‌బాస్ షోపై కేసు(Case on Bigg Boss Show) నమోదు చేశారు. మరోవైపు పల్లవి ప్రశాంత్ అభిమానులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటాగా తీసుకోని తనపై కేసు నమోదు చేశారు.
Pallavi Prasanth Case Details : ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్‌గా మారాయి. వీటిని చూసిన ప్రశాంత్ అందులో వాస్తలం లేదని తాను సొంత ఇంటికి వచ్చానని సోషల్ మీడియోలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్‌గా మారి పోలీసుల దగ్గరకు వెళ్లింది. అప్పటికే తన కోసం వెతుకుతున్న పోలీసులకు తన ఆచూకీ తెలియడంతో సిద్దిపేటలో ఉన్న స్వగృహానికి వెళ్లి ప్రశాంత్ సోదరుడ్ని, తనను అరెస్ట్(Pallavi Prasant Arrest) చేశారు. మరుసటి రోజు కోర్టులో హాజరు పరిచారు. అప్పటి ఈ కేసుకు సంబంధించిన 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో నలుగురు మైనర్‌లు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
పల్లవి ప్రశాంత్ కేసులో మరో 16 మంది అరెస్టు
Bigg Boss 7 Case in Hyderabad : నాంపల్లి కోర్టులో ప్రశాంత్ కేసు విచారణ జరపగా కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించింది. అనంతరం బిగ్‌బాస్ విజేత బయటకి వచ్చాడు. ఇవాళ ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని చేయగా, బిగ్‌బాస్ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఇదేం అభిమానం - బిగ్‌బాస్ ఫ్యాన్స్‌పై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్