ETV Bharat / state

'హోంమంత్రి మనవడి ప్రమేయం ఉందనేది నిరాధారమే.. నిందితుల్లో ప్రముఖ వ్యక్తి కుమారుడు' - హైదరాబాద్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్

Gang Rape on Girl: జూబ్లిహిల్స్ బాలిక అత్యాచార ఘటనలో ఐదుగురు నిందితులను గుర్తించామని వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. ఇప్పటి వరకు పుప్పాలగూడ వాసి సాదుద్దీన్‌ మాలిక్‌(18)ను అరెస్టు చేశామని.. మరో నిందితుడిని రేపు ఉదయం అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా అన్ని ప్రాంతాల్లో మినిట్‌ టు మినిట్‌ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించామన్న ఆయన... ఇన్ని ఆధారాలు సేకరించిన తర్వాత హోం మంత్రి మనువడు ఉన్నారని ప్రచారం చేయడం దారుణమన్నారు.

బాలికపై గ్యాంగ్‌ రేప్‌
'హోంమంత్రి మనవడి ప్రమేయం ఉందనేది నిరాధార ఆరోపణ'
author img

By

Published : Jun 3, 2022, 10:42 PM IST

Updated : Jun 4, 2022, 5:12 AM IST

Gang Rape on Girl: జూబ్లీహిల్స్‌లో బాలిక(17)పై అత్యాచార ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పుప్పాలగూడ వాసి సాదుద్దీన్‌ మాలిక్‌(18)ను అరెస్టు చేశామని వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. మరో నిందితుడు(జువైనల్‌)ని గుర్తించాం.. రేపు ఉదయం అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈకేసులో హోం మంత్రి మనువడి ప్రమేయం ఉందన్న ఆరోపణలు నిరాధారమని తోసిపుచ్చారు. ఓ ప్రముఖ వ్యక్తి కుమారుడి పాత్ర ఉన్నట్టు ఆధారాలు లభించాయని, అతను మైనర్‌ కావడంతో వివరాలు వెల్లడించలేకపోతున్నామన్నారు.

అత్యాచార ఘటన వివరాలు వెల్లడించిన డీసీపీ

ఐదుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు..

‘‘తన కుమార్తెపై దాడి జరిగిందని ఈనెల 31వ తేదీ రాత్రి బాలిక తండ్రి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. 28వ తేదీ జరిగిన పార్టీకి బాలిక వెళ్లింది. ఘటన తర్వాత బాధితురాలు షాక్‌లోకి వెళ్లింది. మా పాపపై లైంగిక దాడి జరిగి ఉంటుందని తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. మరుసటి రోజు పాపను భరోసా కేంద్రానికి తీసుకొచ్చి కౌన్సెలింగ్‌ చేసి వివరాలు తెలుసుకున్నాం. భరోసా కేంద్రం అధికారులు పూర్తి సమాచారం సేకరించి మాకు పంపించారు. ఆ తర్వాత అంతకు ముందు నమోదు చేసిన కేసుతో పాటు అత్యాచారం, పోక్సో చట్టం కింద మరిన్ని సెక్షన్లు కలిపి కేసు నమోదు చేశాం. ఎవరెవరు దాడికి పాల్పడ్డారనేది బాధితురాలు స్పష్టంగా చెప్పలేకపోయింది. ఒక నిందితుడి పేరు మాత్రం వెల్లడించింది. ఆ వివరాల ఆధారంగా... ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాం. సీసీ టీవీ ఫుటేజ్‌ మొత్తం సేకరించాం. సీడీఆర్‌ ఎనాలసిస్‌ చేసి... బాలిక చెప్పిన వివరాలతో సీసీటీవీ ఫుటేజీని సరి పోల్చుకుని ఐదుగురు నిందితులను గుర్తించాం. ఇందులో ముగ్గురు 16.. 17ఏళ్లలోపు వారే. వారిలో పుప్పాలగూడ వాసి సాదుద్దీన్‌ మాలిక్‌(18)ని అరెస్టు చేశాం. రాత్రిపూట మైనర్‌ను చట్ట ప్రకారం అదుపులోకి తీసుకోకూడదు. మరో నిందితుడు ఉమేర్‌ఖాన్‌ (18), మిగతా ముగ్గురు మైనర్లు కావడంతో చట్ట ప్రకారం వారి పేర్లు వెల్లడించలేక పోతున్నాం.

ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం లేదు..

మరో 48 గంటల్లో మిగతా నిందితులను కూడా అరెస్టు చేస్తాం. సాంకేతిక ఆధారాలు సేకరించాం. బాధితురాలు కోలుకున్న తర్వాత 164 సెక్షన్‌ ప్రకారం మరోసారి స్టేట్‌మెంట్‌ తీసుకుని, ఇందులో ఇంకా ఎవరి పాత్రైనా ఉందనే అనేదానిపై పూర్తిగా దర్యాప్తు చేస్తాం. నిందితులు ఎంతటి వారైనా శిక్షపడేలా చూస్తాం. హోం మంత్రి మనువడు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. నిరాధారమైన ఆరోపణ మాత్రమే. బాలిక ఫిర్యాదు ఆధారంగా అన్ని ప్రాంతాల్లో మినిట్‌ టు మినిట్‌ సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించాం. ఇన్ని ఆధారాలు సేకరించిన తర్వాత కూడా హోం మంత్రి మనువడి ప్రమేయం ఉందని ఆరోపణలు చేయడం దారుణం. వారి భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధితురాలి ఫొటో, పేర్లు ప్రచురించిన మీడియాపై కూడా చర్యలు తీసుకుంటాం. ఓ ప్రజాప్రతినిధి కుమారుడు (జువైనల్‌) ఉన్నట్టు కచ్చితమైన సమాచారం ఉంది. (జువైనల్‌ యాక్టు ప్రకారం పేరు చెప్పకూడదు.) ఇప్పటివరకు ఎమ్మెల్యే కుమారుడి పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. పబ్‌లోకి పార్టీ ఉందని బాలికను తీసుకెళ్లారు. పబ్‌లో పార్టీ ఎలా జరిగిందనే దానిపై ఇంకా దర్యాప్తు చేయలేదు. పబ్‌లో నిబంధనలు అతిక్రమించి ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని బాలిక చెప్పలేదు. సీసీ టీవీ ఫుటేజీలో కూడా అలాంటి ఆధారాలు లభించలేదు. నిందితులతో బాలికకు ఇంతకుముందు పరిచయం లేదు. అందుకే వారి పేర్లు కచ్చితంగా చెప్పలేకపోతోంది. బాలిక పూర్తిగా కోలుకున్న తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది. బాలిక కుటుంబం షాక్‌లో ఉండటంతో ఘటన జరిగిన 3రోజుల వరకు ఫిర్యాదు చేయలేకపోయారు. నాకే స్వయంగా వచ్చి ఫిర్యాదు చేస్తే, పోలీస్ స్టేషన్‌ రిఫర్‌ చేశా. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో నిందితులు వీడియో తీసినట్టు అనుమానమే తప్ప.. ఎక్కడా ఆధారాల్లేవు. ఈకేసులో ముందుగా బాలికను ఎవరు తీసుకెళ్లారు అనేది చెప్పలేకపోతోంది’’ అని డీసీపీ వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 4, 2022, 5:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.