Police Found Missing Six Months Old Boy Nizamabad : కామారెడ్డి జిల్లా బాన్సువాడ కొత్తబడి తండాకు చెందిన కాట్రోత్ శ్రీను, మమతలకు 8ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన రెండేళ్లకు బాబు జన్మించాడు. కంటికి రెప్పలా పెంచుకున్న బాబు ఆర్నెళ్ల వయసులోనే మృతి చెందాడు. ఆ తర్వాత మమత మరో బాబుకు జన్మనిచ్చింది. పుట్టిన కొన్ని రోజులకే తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. తల్లిదండ్రుల వల్ల పిల్లలు ఈ జన్యులోపాలతో పుడతారని వైద్యులు తెలిపారు. రెండో బాబు కూడా 2నెలల వయసులో మృతి చెందాడు. నీ కడుపున పుట్టే పిల్లలు ఈ అరుదైన వ్యాధితో చనిపోతారని వైద్యులు మమత దంపతులకు తెలిపారు.
Missing 6 Months Old Boy Found in Nizamabad : 15రోజుల క్రితం మమత కొత్తబడి తండాలో మరో బాబుకి జన్మనిచ్చింది. ఆ బాబు కూడా అనారోగ్యం పాలవడంతో ఈ నెల 14వ తేదీన భర్తతో కలిసి మమత నీలోఫర్ ఆస్పత్రికి వచ్చింది. అక్కడ పరీక్షించిన వైద్యులు బాబు బతకడం కష్టమని చెప్పారు. దీంతో కట్టలు తెంచుకున్న కన్నీరుతో మమత తన పసికందును తీసుకొని ఓపీ వార్డు నుంచి హాల్ లోకి వచ్చింది. అక్కడే తన బాబుతో కూర్చొని రోదించింది. ఎలాగైనా బాబు కావాలని భర్తతో కన్నీరుమున్నీరైంది. పిల్లలు పుట్టినా ఎలాగూ చనిపోతారు కదా.. ఎవరైనా బాబును పెంచుకుందామని మమత ఆలోచించింది. ఇదే విషయాన్ని భర్తతో పంచుకుంది. ఈ క్రమంలోనే నీలోఫర్ ఆస్పత్రి నుంచి చిన్నారిని ఎత్తుకెళ్లాలనే దుర్బుద్ధి పుట్టంది.
6 Months Baby Missing at Niloufer Hospital : నీలోఫర్ ఆసుపత్రిలో ఆరు నెలల బాలుడి అదృశ్యం
Six Months Old Baby Missing Update : అనుకున్నదే తడవుగా తన పదిరోజుల పసికందును అక్కడే వదిలిపెట్టి సమీపంలో ఉన్న హాల్లోకి వెళ్లింది. చిన్నారులను ఆడిస్తున్న తల్లులను గమనించింది. మమతను చూసి ఓ చిన్నారి నవ్వింది. ఆ చిన్నారిని ఎత్తుకొని ఆడిస్తున్న ఫరీదా బేగంతో మమత మాట కలిపింది. ఫరీదా భోజనం కోసం తన పిల్లాడిని అక్కడే పడుకోబెట్టి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన మమత.. ఆర్నెళ్ల చిన్నారిని అపహరించి నీలోఫర్ ఆస్పత్రి నుంచి ఉడాయించింది. బాబును మహిళ ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన తల్లి ఫరీదా నాంపల్లి పీఎస్లో ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించారు.
"బాలుడ్ని తీసుకు వెళ్లిన మమత ఆచూకీ సీసీ కెమెరాల ద్వారా కనిపెట్టాం. అనంతరం ఫోన్ నెంబర్ కనుక్కోని సెల్ఫోన్ సిగ్నల్ ద్వారా వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నాం. అనంతరం అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నాం. బాబుని వారి తల్లిదండ్రులకి సురక్షితంగా అందించాం."-వేంకటేశ్వర్లు, మధ్య మండల డీసీపీ
6 Months Baby Missing at Niloufer Hospital : 14వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో బాబును ఎత్తుకెళ్లిన మమత ఆస్పత్రి నుంచి బయటికి రాగానే తన భర్తకు ఫోన్ లో విషయాన్ని చెప్పింది. వెంటనే ఆటోలో ఎక్కి జూబ్లి బస్ స్టేషన్ కు చేరుకుంది. భర్త కూడా అక్కడికి రావడంతో ఇద్దరూ కలిసి బాన్సువాడకు చేరుకున్నారు. మమత, శ్రీను కలిసి బాన్సువాడలో గది అద్దెకు తీసుకొని కొన్ని నెలలుగా అక్కడే ఉంటున్నారు. నేరుగా గదికి వెళ్లి మమత, శ్రీను బాబు గురించి రహస్యంగా ఉంచారు. పిల్లాడికి పాలు పట్టించిన మమత.. అల్లారుముద్దుగా చూసుకుంది. పోలీసులు సీసీ కెమెరా పరిశీలించడంతో పాటు.. నిందితురాలు ఉపయోగించిన సెల్ ఫోన్ నెంబర్ ను గుర్తించారు. దాని ఆధారంగా బాన్సువాడ వెళ్లి దంపతులను అదుపులోకి తీసుకోవడంతో పాటు చిన్నారిని క్షేమంగా తల్లి ఒడికి చేర్చారు. 14వ తేదీన నీలోఫర్ ఆస్పత్రికి వచ్చిన మమత చావుబతుకుల మధ్య ఉన్న తన 10రోజుల పసికందును ఆస్పత్రిలోనే వదిలి వెళ్లడంతో.. గుర్తించిన సిబ్బంది ఆ రోజు నుంచే ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Missing 6 Months Old Boy Found Safe : ప్రస్తుతం మమత దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. మానవీయ కోణంలో ఆలోచిస్తున్నారు. అమ్మ ప్రేమకు నోచుకోకపోవడంతోనే చిన్నారిని అపహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మమత బాబుకి ఆధునిక చికిత్స ఏదైనా అందుబాటులో ఉందా అని ఆరా తీస్తున్నారు. ప్రముఖ చిన్నపిల్లల ఆస్పత్రుల సాయం తీసుకొని బాబుకు చికిత్స అందించేలా మధ్య మండల డీసీపీ వెంకటేశ్వర్లు చొరవ తీసుకుంటున్నారు. నిందితులుగా ఉన్న మమత, శ్రీనుల విషయాన్ని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ దృష్టికి తీసుకెళ్లి ప్రస్తుతానికి నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబు దగ్గరే ఉంచాలని నిర్ణయించారు. దంపతులను అరెస్ట్ చేసి పంపిస్తే, పసికందు బాగోగులు చూసుకునేది ఎవరనే కోణంలో పోలీసులు మానవతాదృక్పథంతో వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నీలోఫర్ ఆస్పత్రిలో పోలీసుల పర్యవేక్షణలో మమత, శ్రీనులను ఉంచారు. ఐదు రోజుల క్రితం వదిలేసిన పోయిన తన బాబును ఐసీయూలోని ఇంక్యూబేటర్ చూసుకొని పసిబిడ్డ తల్లి రోదించింది.
Six Months Old Baby Missing From Niloufer Hospital : నీలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల చిన్నారి అదృశ్యం
Karimnagar Missing Girl Death : అయ్యో పాప.. డ్రైనేజీలో కృతిక మృతదేహం లభ్యం
GGH missing boy found: ఆస్పత్రిలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. కొద్దిగంటల్లోనే...