Police Forces at Polling Centers in Telangana : ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌ల నుంచి పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగుతారు. కెమెరా మౌంటెడ్ వాహనాలు, గస్తీ వాహనాలతో.. పోలింగ్ కేంద్రాల చుట్టూ పోలీసులు చక్కర్లు కొడుతూనే ఉన్నారు.
Telangana Police on Election Duty : ఎన్నికల విధుల్లో లక్ష మందికిపైగా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 45,000 మంది రాష్ట్ర పోలీసులు(Telangana State Police at Polling Centers), 3,000 మంది ఇతర శాఖలకు చెందిన యూనిఫాం సిబ్బంది ఉన్నారు. 375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నాయి. వీళ్లకు అదనంగా 23,500 మంది హోంగార్డులు ఎన్నికల విధుల్లో ఉన్నారు.
ఖాకీ నిఘాలో పోలింగ్ కేంద్రాలు- లక్షమందితో పటిష్ఠ బందోబస్తు
పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి 10,000 మంది హోంగార్డులు, ఛత్తీస్‌గఢ్ నుంచి 2,500, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి 2,000 చొప్పున 4వేల మంది హోంగార్డులు బందోబస్తుకు వచ్చారు. కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో సీఆర్ఫీఎఫ్, సీఐఎస్ఎఫ్, బీఎస్‌ఫ్, అసొం రైఫిల్స్, ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సశస్త్ర సీమాబల్‌కు చెందిన పోలీసులు(Central Polices in Election Duty) ఉన్నారు. ఒక్కో కంపెనీలో 80 నుంచి 100 మంది ఉంటారు.
రాష్ట్రంలో ఎన్నికల సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది వివరాలు :
క్రమ సంఖ్య | రాష్ట్రం | పోలీస్ సిబ్బంది |
1 | తెలంగాణ | 45,000 |
2 | కర్ణాటక, మహారాష్ట్ర | 10,000 |
3 | ఛత్తీస్‌గఢ్ | 2,500 |
4 | మధ్యప్రదేశ్ | 2000 |
5 | ఒడిశా | 2000 |
6 | ఇతర సిబ్బింది | 3,000 |
మొత్తం | 1,00,000 మందిపైగా |
ఓటు వేయడానికి ఫ్రీగా ర్యాపిడో బుక్ చేసేయ్ - ఓటింగ్ శాతాన్ని పెంచేయ్
Central Forces at Telangana Polling Centers : హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండతో పాటు ఇతర జిల్లాల్లోనూ పోలీస్ బలగాలు మోహరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా.. ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగేందుకు ఈసీ నిఘాను ఏర్పాటు చేసింది. ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడితే.. వెంటనే ఈ బలగాలు అప్రమత్తమయి అదుపులోకి తీసుకుంటారని ఈసీ తెలిపింది. కేంద్ర సాయుధ బలగాలతో పాటు స్థానిక పోలీసులు పహారా కాస్తున్నారు. ఓటర్లు ధైర్యంగా తమ ఓటు హక్కు(Right to Vote)ను వినియోగించుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
ప్రలోభాలకు లొంగకుండా ప్రతిఒక్కరు నిర్భయంగా ఓటు వేయాలి : వికాస్‌రాజ్