ETV Bharat / state

'విషజ్వరాల విజృంభనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం'

రాష్ట్రంలో విష జ్వరాలు, దోమ కాటు విజృంభనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ ఆరోపించారు. 'విషజ్వరాలు-దోమకాటు-ప్రభుత్వ బాధ్యత' అనే అంశంపై హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో కోదండరామ్​తో పాటు పలువురు వైద్యులు, జన విజ్ఞాన వేదిక నాయకులు పాల్గొన్నారు.

author img

By

Published : Sep 10, 2019, 10:16 AM IST

'విషజ్వరాలు విజృంభన... రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం'

రాష్ట్రంలో విష జ్వరాలు, డెంగీ, దోమ కాటు విజృంభించడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్​ అన్నారు. దోమకాటు, చికెన్ గున్యా, డెంగీ, మలేరియా వ్యాధులను అదుపు చేయవచ్చునని... కానీ దానిని నియంత్రించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఈ రోగాలతో కొద్ది రోజులు బాధపడుతూ ప్రజలు మరిచిపోతారన్న ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సకాలంలో వ్యాధి నిర్ధరణ జరగాలని.. దానికి అవసరమైన ప్రాథమిక కేంద్రాలను రాష్ట్రంలో మరిన్ని పెంచాలని కోరారు. 'విషజ్వరాలు-దోమకాటు-ప్రభుత్వ బాధ్యత' అనే అంశంపై హైదరాబాద్ నాంపల్లిలోని సమితి కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో కోదండరామ్​తో పాటు పలువురు వైద్యులు, జన విజ్ఞాన వేదిక నాయకులు పాల్గొన్నారు. వ్యాధి నివారణ చర్యలు వేసవి కాలం నుంచే మొదలు కావాలని... ఆ పని చేయకపోవడం వల్లే ప్రస్తుతం విషజ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దేశం ఆర్థిక మాంద్యంలో ఉందనే సాకుతో వైద్యానికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు.

ఇదీ చూడండి: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి కేటీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.