ETV Bharat / state

'పోడుభూములేవి.. రైతు బంధులో రాజకీయ జోక్యమా' - పోడు భూములపై సీఎం కేసీఆర్​ హామీ

పోడు భూముల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండోవిడత ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్​ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఇంకా ఆ సమస్య అలాగే ఉందన్నారు.

Podu Bhumulu, Political involvement in rythu bandhu scheme
'పోడుభూములేవి.. రైతు బంధులో రాజకీయ జోక్యమా'
author img

By

Published : May 24, 2020, 5:19 PM IST

పోడు భూముల అంశం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటికీ పరిష్కారం కాకుండా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ప్రతీ సంవత్సరం అటవీశాఖ, రెవిన్యూ అధికారుల బెదిరింపుల మధ్య వారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పోడు భూముల రైతుల సమస్యలను ఆయా జిల్లాల్లో కూర్చొని పరిష్కారం చేస్తానని సీఎం హామీ ఇచ్చిరని అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మాసాలు గడిచిపోయినా.. ఇప్పటికీ ఆ వాగ్దానం అమలు కాలేదని విమర్శించారు. కొన్ని చోట్ల ఫారెస్టు, రెవిన్యూ శాఖల మధ్య హద్దుల వివాదం పరిష్కారమైనట్లు తెలుస్తుందని.. అలాంటి చోట్ల లాభోక్తులకు భూమి పట్టాలివ్వడం సరికాదన్నారు. ఆ పోడు భూములపై ఆధారపడి జీవించే వారికి పట్టాలు ఇవ్వాలని చాడ డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కొత్తగా అమలు చేయబోతున్న నియంత్రిత వ్యవసాయం రైతు సమితిల ద్వారా అమలు చేయడం సరికాదన్నారు. రైతులకు ఏ నేలలో ఏ రకం పంట వేయాలో అవగాహన కల్పించాలన్నారు. రైతు సమితుల్లో తెరాస నాయకులు మాత్రమే ఉన్నారని అన్నారు. రైతు బంధులో రాజకీయ జోక్యమా అని సీపీఐ ప్రశ్నిస్తుందని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి : ఓయూ ప్రహరీ గోడ వద్ద స్థలంలో నిర్మాణంపై కాంగ్రెస్‌ నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.