ETV Bharat / state

ఈటీవీ భారత్​ స్పందన: '‘పీఎం కిసాన్‌’'లో తెలంగాణకు చోటు - telangana news

ఈటీవీ భారత్​, ఈనాడులో ప్రచురితమైన కథనం కేంద్ర, రాష్ట్ర వ్యవశాయ శాఖల్లో కదలిక తెచ్చింది. పీఎం కిసాన్​ పథకం వెబ్​సైట్​లో తెలంగాణను ప్రత్యేకంగా సూచించకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​నే చూపుతున్నారంటూ... ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. కేంద్ర వ్యవసాయ శాఖ వెంటనే వెబ్​సైట్‌లోని భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించింది.

pm kisan scheme identified telangana
pm kisan scheme identified telangana
author img

By

Published : Aug 6, 2020, 7:25 AM IST

రైతులకు పెట్టుబడులను అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎంకిసాన్‌) పథకం వెబ్‌సైట్‌లోని భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సూచించకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్నే చూపుతున్నారంటూ ‘ఈటీవీ భారత్​, ఈనాడు’లో ‘పీఎం కిసాన్‌లో తెలంగాణ ఏదీ?’ శీర్షికన ప్రచురితమైన వార్త కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖల్లో కదలిక తెచ్చింది.

ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి బుధవారం ఉదయమే కేంద్ర వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ వెంటనే వెబ్​సైట్‌లోని భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించడమే కాకుండా పీఎం కిసాన్‌ పథకం కింద లబ్ధిపొందిన రాష్ట్ర రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో చూపించింది.

ఇదీ చదవండి: ఇలా ఆవిరిపడితే ముఖం వెలిగిపోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.