ETV Bharat / state

రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ: వినోద్​ కుమార్​

రాష్ట్రంలో జాతీయ రహదారుల పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. తెరాసలోక్ సభ పక్షనేత నామ నాగేశ్వరరావుతో భేటీ అయిన వినోద్... పెండింగ్​లో ఉన్న జాతీయ రహదారుల విషయమై చర్చించారు.

planning commission vice president vinod kumar met with mp nama nageshwara rao in hyderabad
రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ: వినోద్​ కుమార్​
author img

By

Published : Nov 5, 2020, 10:42 PM IST

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెరాసలోక్ సభ పక్షనేత నామ నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. పెండింగ్​లో ఉన్న జాతీయ రహదారుల విషయమై చర్చించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆరోపించారు. విభజన చట్టంలో పొందుపర్చినట్లుగా రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని వినోద్ అన్నారు.

పలు పట్టణాలు, ప్రాంతాల మధ్య నాలుగు, ఆరు లైన్ల జాతీయ రహదార్లతో పాటు రెండు, నాలుగు లైన్ల జాతీయ రహదార్లు 2,273 కిలోమీటర్ల రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గణాంక లెక్కల ప్రకారం రాష్ట్రంలో గత ఐదేళ్లలో కేవలం 126 కిలోమీటర్ల మేరకు మాత్రమే నాలుగు లైన్ల జాతీయ రహదారులు వేశారని విచారం వ్యక్తం చేశారు. కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందనడానికి ఇదే నిదర్శమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పెండింగ్ జాతీయ రహదారుల తుది మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులను ముమ్మరం చేయాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నామ నాగేశ్వరరావును వినోద్ కుమార్ కోరారు.

ఇదీ చదవండి: ధరణిని సమర్థంగా, పారదర్శకంగా నిర్వహించాలి: సీఎస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.