pil on private university reservation : ప్రైవేట్ వర్శిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 25 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సామాజిక కార్యకర్త రాథోడ్ సుబేందర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికులకు 85శాతం రిజర్వేషన్ ఉండాలని... దానికి విరుద్ధంగా 25శాతమే కేటాయించారని పిటిషనర్ వాదనలు వినిపించారు. అయితే 85 శాతం రిజర్వేషన్లు కేవలం ప్రభుత్వ యూనివర్సిటీలకు వర్తిస్తుందని.. ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉండదని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.
ఇదీ చూడండి: గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థులు అర్హులే: హైకోర్టు