ETV Bharat / state

PG Joint Admissions Counseling Schedule Released : పీజీ ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల.. సెప్టెంబరులోనే రిజిస్ట్రేషన్​ - పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్​ షెడ్యూల్​ 2023

PG Counseling Schedule 2023
PG Joint Admissions Counseling Schedule Released
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 7:44 PM IST

Updated : Aug 30, 2023, 8:06 PM IST

19:38 August 29

PG Joint Admissions Counseling Schedule Released : పీజీ ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల

CPGET PG Joint Admissions Counseling Schedule 2023 : పీజీ ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్​ షెడ్యూల్​ను ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(CPGET) విభాగం కన్వీనర్​ పాండురంగారావు విడుదల చేసింది. సెప్టెంబరు 5 నుంచి 15 వరకు పీజీ అభ్యర్థుల రిజిస్ట్రేషన్లు జరగుతాయని వెల్లడించారు. సెప్టెంబరు 20 నుంచి 22 వరకు పీజీ ప్రవేశాల వెబ్​ ఆప్షన్లు(Web Options) స్వీకరిస్తారని తెలిపారు. ఆప్షన్లను సవరించుకోవడానికి .. సెప్టెంబరు 23న అవకాశం కల్పించనున్నామని వెల్లడించారు. మొత్తం రెండు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు.

సెప్టెంబరు 26న మొదటి విడత పీజీ సీట్లను కేటాయించనున్నట్లు కన్వీనర్ పాండురంగారావు తెలిపారు. సెప్టెంబరు 29లోగా అభ్యర్థులు తమకు సీటు వచ్చిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుందన్నారు. మిగిలిన సీట్ల భర్తీ కోసం అక్టోబరు 1 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఓయూ, కేయూ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూహెచ్, మహిళా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంఈడీ, తదితర 66 పీజీ కోర్సుల్లో ప్రవేశాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక విద్యార్థులు అన్ని సర్టిఫికెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమతో పాటు ఒరిజినల్‌ సర్టిఫికేట్లను తీసుకురావాలని కోరారు. ఈనెల 22న సీపీగేట్‌ ఫలితాలు వెల్లడైతే.. 55,739 మంది కన్వీనర్‌ సీట్ల కోసం పోటీపడొచ్చు. జర్నలిజంతోపాటు ఎంఎస్సీ డేటా సైన్స్‌ సీట్ల కోసం ఈ నెల 31న ప్రవేశ పరీక్ష జరగనుందని, వారు కూడా కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని కన్వీనర్‌ తెలిపారు.

Career After Intermediate Telangana : ఇంటర్ తర్వాత విద్యార్థుల పయనమెటు..?

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఖాళీల భర్తీకి ఆగస్టు 30న కౌన్సెలింగ్‌ : తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌, బీటెక్‌(వ్యవసాయ, ఇంజినీరింగ్‌, ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ఆగస్టు 30న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ వెంకటరమణ తెలిపారు. విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలోనే కౌన్సెలింగ్‌ జరగనున్నట్లు వివరించారు. బీటెక్‌ సీట్లలో 40 శాతం సీట్లను రైతు కోటాకు, బీఎస్సీలో 40 శాతం సీట్లు గ్రామీణ కోటాకు కేటాయించనున్నట్లు ప్రకటించారు.

August 30 Counseling For Telangana Agricultural University : ఇంటర్‌ ఎంపీసీలోని ఉత్తీర్ణులై ఎంసెట్‌ 2023లో ర్యాంకులు పొందిన వారు అర్హులని వివరించారు. ఇంటర్‌ ఎంపీసీ, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కౌన్సెలింగుకు హాజరుకావాలని సూచించారు. టీఎస్‌ఎంసెట్‌లో పాసైన అభ్యర్థులలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకూ మొదటి ప్రాధాన్యత ఉంటుందని రిజిస్ట్రార్‌ వెంకటరమణ తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఫీజు రూ.45 వేలతో హాజరు కావాలని సూచించారు. ఇతర సమాచారం కోసం తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ www.pjtsau.edu.in లో చూసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికేట్లను తీసుకురావాలని.. ఆలస్యం చేయవద్దని సూచించారు.

Medical Reservation Seats : ఇకపై వంద శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే

Engineering Seats in Telangana 2023 : రాష్ట్రంలో మిగిలిపోయిన ఇంజినీరింగ్‌ సీట్లు 16,926

Kaloji Health University : ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్‌

Last Updated : Aug 30, 2023, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.