ETV Bharat / state

రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్​, డీజిల్​ వాడకం - పెట్రోల్​ వార్తలు

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో వాహన రాకపోకలు సాధారణ స్థితికి చేరి.. అదే స్థాయిలో పెట్రోలు, డీజిల్‌ విక్రయాలూ ఊపందుకున్నాయి. గడిచిన రెండు వారాల్లో 90 శాతానికి పైగా పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతరాష్ట్ర బస్సులు, ఇతర వాహన రాకపోకలు పూర్తిస్థాయిలో పున:ప్రారంభమైతే.... ఈ విక్రయాలు సాధారణ స్థాయిని మించిపోతాయని చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి.

petrol and diesel sales increasing in telangana
రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్​, డీజిల్​ వాడకం
author img

By

Published : Jun 17, 2020, 3:57 AM IST

పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు ఊపందుకున్నాయి. ఆంక్షల సడలింపులతో రాకపోకలు సాధారణస్థాయికి చేరడం వల్ల గడిచిన రెండు వారాలుగా అమ్మకాల్లో గణనీయ వృద్ధి నమోదైంది. లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో అమల్లో ఉన్నప్పుడు... సాధారణ రోజుల్లో జరిగే అమ్మకాలతో పోలిస్తే 30శాతం కంటే తక్కువగా ఉండేవి. నిబంధనల సడలింపుల అనంతరం వాహనాలు అధిక సంఖ్యలో రోడ్డెక్కడం వల్ల పెట్రోలు, డీజిల్‌ విక్రయాలు భారీగా పెరిగాయి.

కేంద్రం మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ కఠినంగా అమలైతే సరకు రవాణా వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయి నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటే అవకాశముందని కేంద్రం భావించింది. లాక్‌డౌన్‌ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు చెందిన వాహనాలను ఆపకుండా చూడాలని కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. మే నెల రెండో వారం నుంచి పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు పెరిగాయి.

70 శాతానికిపైగా అమ్మకాలు

సాధారణ రోజుల్లో జరిగే పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల్లో 70 శాతానికిపైగా అమ్మకాలు జరిగినట్లు చమురు సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈనెల మొదటి రెండు వారాలు జరిగిన అమ్మకాలను గతేడాది ఇదే సమయంలో జరిగిన విక్రయాలను పరిశీలిస్తే.... దాదాపు 92శాతం పెట్రోల్‌, 94శాతం డీజిల్‌ అమ్మకాలు జరుగుతున్నట్లు చమురు సంస్థల లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2019 జూన్‌ మొదటి రెండు వారాల్లో పెట్రోల్‌ 61 వేల 991 లీటర్లు అమ్మకాలు జరగ్గా.... ఈ ఏడాది అదే సమయంలో 56 వేల 831 లీటర్ల విక్రయాలు జరిగాయి. ఇక గతేడాది లక్ష 33వేల 228 లీటర్ల డీజిల్‌ అమ్మకాలు జరగ్గా... ఈ ఏడాది అదే సమయంలో 5.86శాతం అమ్మకాలు తగ్గి లక్ష 25వేల 421 కిలో లీటర్లు విక్రయాలు జరిగాయి.

కరోనా భయంతో 90 శాతం మంది ప్రజలు వ్యక్తిగత వాహనాలనే వాడుతుండడం వల్ల పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు అనూహ్యంగా పెరుగుతున్నాయని చమురు సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సిటీ సర్వీసులు, అంతరాష్ట్ర బస్సు, ఇతర వాహన సర్వీసులు పునఃప్రారంభమైతే.... పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు గతం కంటే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇవీ చూడండి: తక్కువ ధరకే మాస్కులు... నకిలీ పత్రాలతో పక్కా ప్లాన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.