ETV Bharat / state

Banjarahills pub case: బంజారాహిల్స్ పబ్ కేసులో తెరపైకి మరో పేరు

pub
pub
author img

By

Published : Apr 4, 2022, 4:58 PM IST

Updated : Apr 4, 2022, 5:36 PM IST

16:56 April 04

బంజారాహిల్స్ పబ్ కేసులో పోలీసుల దర్యాప్తు

Banjarahills pub case: బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో నిందితులను కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఏడు రోజులు కస్టడీ కోరారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎంత మందికి కొకైన్ అందించారు? పబ్‌లో ఉన్న వారు ఎంత మంది మాదకద్రవ్యాలు సేవించారు? గతంలో ఇలాంటి పార్టీలు ఎన్ని నిర్వహించారు? అనే అంశాలపై విచారణ చేసేందుకు పోలీసులు కస్టడీ కోరినట్లు తెలుస్తోంది. పబ్ మేనేజర్ అనిల్, భాగస్వామి అభిషేక్‌లను వారం రోజులు కస్టడీ కోరారు. ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ఏ4గా కిరణ్‌రాజ్‌ను చేర్చారు. గతంలో పుడింగ్ అండ్ మింక్ పబ్ నడిపినట్లు సమాచారం. అభిషేక్ ఐఫోన్‌ను సీజ్ చేసిన పోలీసులు... అతని చరవాణిలో కీలక సమాచారం ఉంటుందని భావిస్తున్నారు. కస్టడీలోకి తీసుకున్న అనంతరం విచారణలో భాగంగా అతని కాంటాక్ట్స్, వాట్సాప్ చాటింగ్ తనిఖీ చేయనున్నారు.

దర్యాప్తు వేగవంతం: బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పబ్ లోపలికి డ్రగ్స్ ఏ విధంగా వచ్చాయని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పబ్‌లోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పబ్ ఉన్న రాడిసన్ బ్లూ హోటల్‌లోని ఫుటేజ్‌ని కూడా సేకరించారు. కేసులో ఎ1గా ఉన్న పబ్ భాగస్వామి అభిషేక్... సినీ, రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల నుంచి కూడా ఈ పబ్‌ను బుక్ చేసుకుని వస్తుంటారు. 24గంటలూ మద్యం అందుబాటులో ఉంటడం వల్ల... తరచూ పార్టీలు చేసుకుంటున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. చాలా రోజులుగా ఈ పబ్‌లో ఈ తరహా పార్టీలు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

అతడే కీలకం: ఈ పబ్‌కు అనిల్ కుమార్‌ను పబ్ పార్ట్‌నర్లు మేనేజర్‌గా నియమించుకున్నారు. అనిల్ ఇక్కడ జరిగే ప్రతి పార్టీలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పబ్‌పై పోలీసుల రైడ్ చేసే సమయంలో అతని టేబుల్‌పై మాదకద్రవ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న 5 ప్యాకెట్లలో 4.64గ్రాముల కొకైన్ ఉన్నట్లు తేల్చారు. వీటితో పాటు టిష్యూ పేపర్లు, టూట్ పిక్స్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కి పంపారు.

వారి కోసం గాలింపు: ప్రస్తుతం బంజారాహిల్స్‌ పోలీసులతో పాటు నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అర్జున్‌తో పాటు కిరణ్ రాజ్ కోసం టాస్క్‌ఫోర్స్ బృందాలు గాలిస్తున్నాయి. కిరణ్ రాజ్ గతంలో ఆ పబ్‌కు యజమానిగా పోలీసులు గుర్తించారు. 2020 ఆగస్టు నుంచి అభిషేక్‌తో పాటు అతను కూడా భాగస్వామిగా ఉన్నారని సమాచారం. ఎఫ్ఐఆర్‌లో ఎ4గా చేర్చిన కిరణ్ రాజ్ మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సమీప బంధువని సమాచారం. పోలీసులు పబ్‌పై రైడ్ చేసిన సమయంలో పబ్‌లో వీరద్దరు లేరు. దాడి సమాచారం తెలుసుకొని పరారీ అయ్యారని పోలీసులు భావిస్తున్నారు.

కస్టడీ కోరిన పోలీసులు: శనివారం ఓ పుట్టిన రోజు వేడుకల కోసం 250 మంది పబ్‌ను రిజిస్ట్రేషన్ చేసుకోగా... అందులో కొంత మంది మాత్రమే పార్టీకి హజరయ్యారు. వీరిలో మాదకద్రవ్యాలు ఎవరు సేవించారు? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మరోవైపు కేసులో కీలక అంశాలు తెలసుకునేందుకు అరెస్ట్ అయిన నిందితులు ఇద్దరిని పోలీసులు కస్టడీకి కోరారు.

సంబంధిత కథనాలు..

Last Updated : Apr 4, 2022, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.