ETV Bharat / state

హైకోర్టులో పిటిషన్​.. రూ.50 వేలు జరిమానా - Deliberately laid 50 finger fine

నాగార్జునసాగర్ డ్యామ్​కు సమీపంలో కొత్తగా పెట్రోలు పంపు ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ పిల్​ దాఖలు చేయడంలో దురుద్దేశాలున్నాయని హైకోర్టు తెలిపింది. ఉద్దేశపూర్వకంగా పిటిషన్​ దాఖలు చేసినందుకు రూ.50 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

Petition in the telangana High Court Rs 50 thousand fine
హైకోర్టులో పిటిషన్​.. రూ.50 వేలు జరిమానా
author img

By

Published : Aug 29, 2020, 4:52 AM IST

నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యామ్​కు సమీపంలో కొత్తగా పెట్రోలు పంపు ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ పిల్​ దాఖలు చేయడంలో దురుద్దేశాలున్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. దురుద్దేశపూర్వకంగా ప్రజాప్రయోజన పిటిషన్‌ను దాఖలు చేసినందున రూ.50 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. నల్గొండ జిల్లాకు చెందిన బి.ఎ. వెంకటేశ్వర్లు మరో పెట్రోలు బంకులో పనిచేస్తున్నారని.. పిటిషనర్ వెనుక మరొకరున్నారని తెలుస్తోందని హైకోర్టు పేర్కొంది.

ఆ మొత్తాన్ని న్యాయవాదుల సంక్షేమ నిధికి రెండు వారాల్లో చెల్లించాలని.. లేదంటే ఈ వ్యవహారాన్ని కోర్టు దిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. నాగార్జునసాగర్​ డ్యామ్​కు సమీపంలో నూతన పెట్రోలు బంకు ఏర్పాటుకు అనుమతించకుండా ఆదేశాలివ్వాలంటూ వెంకటేశ్వర్లు పిల్​ దాఖలు చేశారు.

ఆ పిటిషన్​ను ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం కౌంటరు దాఖలు చేస్తూ ఇది డ్యామ్ సైట్​లోకి రాదని పేర్కొంది. పెట్రోలు బంక్​ కోసం జరిపిన తవ్వకాలతో డ్యామ్​కు ఎలాంటి నష్టం వాటిల్లదని తెలిపింది. పిటిషనర్ మరో పెట్రోలు బంకులో పనిచేస్తున్నారని వెల్లడించింది.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.