ETV Bharat / state

జిమ్ చేసే యువతకు స్టెరాయిడ్స్ వల.. హైదరాబాద్​లో ముఠా గుట్టు రట్టు..!

author img

By

Published : Mar 4, 2023, 6:08 PM IST

Steroids Usage Increased In Hyderabad: వ్యాయామ కేంద్రాల్లో కసరత్తు చేసే యువతే వారి లక్ష్యం. చక్కటి దేహదారుఢ్యం, శరీరాకృతి తొంద‌ర‌గా రావాలంటే స్టెరాయిడ్లు వాడమని మొద‌ట ప్ర‌చారం చేస్తారు. దాన్ని న‌మ్మి కొనుగోలు చేసేందుకు సిద్ధ‌ప‌డే వాళ్ల‌కు దర్జాగా వాటిని విక్రయించేస్తున్నారు. ఇలాంటి ముఠాను పోలీసులు, ఔషధ నియంత్రణ విభాగం అధికారులు తాజాగా ప‌ట్టుకున్నారు.

Steroids Usage Increases Gradually In Hyderabad

Steroids Usage Increased In Hyderabad: ఈ మ‌ధ్య కాలంలో ఆరోగ్యం మీద శ్ర‌ద్ధ పెరిగింది. ప‌ల్లె, ప‌ట్ట‌ణాలు, చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ వ్యాయామాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్ త‌ర్వాత ఇది రెట్టింపైంది. ఫ‌లితంగా పార్కులు, జిమ్ముల్లో చెమ‌టోడ్చే వారి సంఖ్య ఎక్కువైంది. వీరితో పాటు మంచి శ‌రీరాకృతి, దేహదారుఢ్యం కోసం అనేక మంది యువ‌తీ యువ‌కులు క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇలా జిమ్ముల్లో క‌ష్ట‌ప‌డే వారిని కొంద‌రు అక్ర‌మార్కులు ల‌క్ష్యం చేసుకుంటున్నారు.

గంట‌ల త‌ర‌బ‌డి చెమ‌టోడుస్తూ వ్యాయమం చేసే బ‌దులు.. స్టెరాయిడ్లు వాడితే సుల‌భంగా మంచి ఆకృతిని సొంతం చేసుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. త‌క్కువ స‌మ‌యంలో అనుకున్న ఫ‌లితం వ‌స్తుంద‌ని న‌మ్మ‌బ‌లికిస్తూ.. ప‌లువురిని వ‌ల‌లో వేసుకుంటున్నారు. ఆస‌క్తి ఉన్న వాళ్ల‌కు ఇంజెక్ష‌న్లు విక్ర‌యిస్తున్నారు. వీటి వాడకం ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలియని కొందరు వాటిని కొనుగోలు చేస్తూ ఆరోగ్యాలు నాశ‌నం చేసుకుంటున్నారు.

సనత్‌నగర్‌కు చెందిన ఓంప్రకాశ్​, అంబర్‌పేట్‌ వాసి నరేశ్​, సయ్యద్‌ ఫారూక్‌, అవినాష్‌ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఓం ప్రకాష్ జిమ్ శిక్షకుడిగా పని చేస్తున్నాడు. అధిక సంపాదన కోసం అడ్డ‌దారులు తొక్కేందుకు కూడా వెనుకాడ‌లేదు. ఈ క్ర‌మంలో స్టెరాయిడ్లు విక్రయించే దందాకు తెర తీశాడు. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే వారితో పాటు.. ప‌లు ప‌రిచయాల ద్వారా విక్ర‌యించ‌డం ప్రారంభించాడు. శరీరం ఫిట్‌గా ఉండేందుకు 250 ఎంజీ డ్యూరాడెక్స్‌, సి జెట్క్, స్ట్రామ్‌బియర్‌, ఎయిర్‌స్లెన్‌, డెబోలాన్‌ వంటి స్టెరాయిడ్లు జిమ్ముల్లో కరసత్తు చేసే యువతకు సరఫరా చేస్తున్నాడు.

స్టెరాయిడ్లు విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో 1100 ట్యాబ్లెట్లు, 180 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుల్లో అవినాష్ ప‌రారీలో ఉన్నాడ‌ని, అత‌డి కోసం గాలిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. వ్యాయామం చేసే వారు ఈ తరహా స్టెరాయిడ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప‌లువురు నిపుణులు సూచిస్తున్నారు. వీటి వాడకం కారణంగా ఆరోగ్యంపై దుష్ఫలితాలు పడతాయని.. న‌గ‌రంలో ఇలాంటి వారి గురించి స‌మాచారం అందితే.. త‌మ‌కు తెలియ‌జేయాల‌ని పోలీసులు కోరుతున్నారు.

జిమ్ముల్లో వ్యాయామం చేసే యువ‌త ఇలాంటి వాటి గురించి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. జిమ్ శిక్ష‌కులే కాకుండా.. ఇత‌రులు స్టెరాయిడ్లు, ప్రొటీన్ పౌడ‌ర్లు తీసుకుంటే కండ‌లు తిరిగే దేహం సొంత‌మ‌వుతుందని చెబితే న‌మ్మ‌కండని.. ఒక‌వేళ వ‌చ్చినా.. అవి కొంత‌కాల‌మే ఉంటాయ‌నే నిజం తెలుసుకోండని చెబుతున్నారు. దీనికి తోడు సైడ్ ఎఫెక్ట్లు వ‌చ్చే అవ‌కాశ‌మూ ఉంటుందంటున్నారు. కాబ‌ట్టి అలాంటి వారితో జాగ్ర‌త్త‌గా ఉండండి. చ‌క్క‌టి ఫ‌లితాలు రావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంద‌ని గ్ర‌హించండి. స‌హ‌జ ప‌ద్ధ‌తిలో వ్యాయామం చేసి మంచి శ‌రీరాకృతితో పాటు ఆరోగ్య‌మూ సంపాదించండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.