ETV Bharat / state

'ఈ సమయంలో కూడా నిరసన చేస్తున్నామంటే అర్థం చేసుకోండి' - డంపింగ్‌ యార్డు

హైదరాబాద్‌ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్​ను తరలించాలని స్థానికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. గత 15 ఏళ్లుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్‌ యార్డుతో ఇబ్బందులు పడుతున్నకాలనీ వాసులతో ఈటీవీ భారత్​ ప్రతినిధి కార్తీక్ ముఖాముఖి.

people-protest-at-hyderabad-at-about-jawaharnagar-dumping-yard
'ఈ సమయంలో కూడా నిరసన చేస్తున్నామంటే అర్థం చేసుకోండి'
author img

By

Published : May 23, 2020, 7:11 PM IST

'ఈ సమయంలో కూడా నిరసన చేస్తున్నామంటే అర్థం చేసుకోండి'

ప్ర. మీ ప్రధాన సమస్య ఏంటి?

జ. ఈ డంపింగ్ యార్డ్​ రెండు నెలల నుంచి విపరీతమైన వాసన వస్తోంది. కొవిడ్ ఉన్నా కూడా మేము బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నామంటే మా బాధను మీరు అర్థం చేసుకోండి. పిల్లలకు వాంతులు అవుతున్నాయి. పెద్దవాళ్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గాలి మొత్తం కాలుష్యమై పోయింది.

ప్ర. ఇన్ని రోజుల నుంచి అధికారులకు ఫిర్యాదు చేశారా? వాళ్లు స్పందించారా?

జ. వాళ్లకి చాలా సార్లు ఫిర్యాదు చేశాం కానీ... వారు పట్టించుకోవట్లేదు. గాలి మొత్తం కాలుష్యమైపోయింది. సరిగా తిండి కూడా తినలేకపోతున్నాం. పడుకుంటే హఠాత్తుగా మెలకువ వచ్చి వాంతులు అయిపోతున్నాయి. నీళ్లు కూడా తాగలేకపోతున్నాం. యాభై లక్షలు పెట్టి ఇళ్లు కొన్నాం. ఇళ్లు ఖాళీ చేసి పోలేం కదా. డంపింగ్ యార్డ్ ఉన్నప్పుడు 2 కి.మీ దూరంలో ఏమి ఉండకూడదని తెలియదా? లే అవుట్​కి ఎలా పర్మిషన్ ఇచ్చారు. అప్పుడే అప్రమత్తం చేసి ఉంటే... మేము కూడా ఆలోచించుకునే వాళ్లం కదా...

ప్ర. పిల్లలకి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.?

జ. పిల్లలు, వృద్ధులు గాలి పీల్చుకుంటే వాంతులు రావడం, కల్లు తిరగడం జరుగుతున్నాయి. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరింత ఇబ్బందులు వస్తున్నాయి. చాలామంది అద్దెకుండే వాళ్లు వెళ్లిపోయారు. సొంత ఇళ్లు ఉన్న మేము ఎక్కడికి పోవాలి. నీళ్లు కూడా చాలా కలుషితమైపోయాయి. ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది.

అధికారులు ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని... కనీసం తిండి కూడా తినలేకపోతున్నామని కాలనీ వాసులు వాపోయారు. జీహెచ్​ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా... పట్టించుకోవడం లేదని వాపోయారు. విధిలేని పరిస్థితుల్లో ఇక్కడే ఉంటున్నామని.... సమస్య తీరే వరకు ఆందోళన కొనసాగిస్తున్నామంటున్నారు కాలనీవాసులు.

ఇవీ చూడండి: గొర్రెకుంట బావిలో మృతదేహాలపై వీడుతున్న మిస్టరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.