ETV Bharat / state

'పింఛనే దిక్కు.. తొలగిస్తే బతికేది ఎలా' - Kurnool District Latest News

ఓ వ్యక్తిని చూసేవారు కూడా ఎవరూ లేరు. మరొకరికి ఏమీ లేకపోయినా.. రెండు ఇళ్లు ఉన్నాయని చెప్పి పింఛను తీసేశారు. ఇంకొకరికి.. సంవత్సరం నుంచీ పింఛనే రావడం లేదు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ. ఇలా వేరువేరు కారణాలతో పింఛను తీసేయడంతో వారి బతుకులు కష్టంగా మారాయి. ఇదీ ఏపీలో పింఛన్​లు రద్దు చేసిన బాధితుల పరిస్థతి.

ap
ap
author img

By

Published : Jan 2, 2023, 5:31 PM IST

ఆంధ్రప్రదేశ్​లో తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించి.. పేదవారిని ఆదుకోవాలని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. సీపీఐ ఆధ్వర్యంలో కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అదేవిధంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పలువురు బాధితులు.. ఒంగోలు కలెక్టరేట్​లో జరిగే స్పందనలో అర్జీ ఇచ్చేందుకు వచ్చారు. అయితే వారిని పోలీసులు లోనికి వెళ్లకుండా అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

పింఛన్​దారునికి, కుటుంబ సభ్యులకు 1000 చదరపు గజాల ఇంటి స్థలం ఉందని.. కరెంట్ బిల్లు వినియోగం 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉందనే కారణంతో పింఛన్లు తొలగించారని బాధితులు తెలిపారు. అదే విధంగా కుటుంబ సభ్యులు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగం తదితర కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా 4,00,000 నుంచి 6,00,000 వరకు పింఛన్లు తొలగించటం జరుగుతోందని వారు ఆరోపించారు. ప్రభుత్వం తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న పింఛన్లు.. వివిధ కారణాలతో తొలగించడం సరికాదని పేర్కొన్నారు.

"నాకు 30 ఏళ్ల నుంచి పింఛన్ వస్తోంది. నా భార్య పేరు మీద రెండు ఇళ్లు ఉన్నాయని చూపించి.. పింఛన్ రద్దు చేశారు. పింఛను వస్తేనే నేను బతకగలను. కావాలంటే వచ్చి పరిశీలించండి. నాకు ఎటువంటి ఇళ్లు లేవు.. ఆస్తులు లేవు. ముఖ్యమంత్రి నాకు ఆ ఇళ్లు ఇప్పిస్తే.. నేనే ఆయనకు తిరిగి పింఛను ఇస్తా." - సత్యనారాయణ, దివ్యాంగుడు.

"నాకు ఎవరూ లేరు. నన్ను చూసేవారు కూడా లేరు. ఎవరైనా నన్ను చూసేవారు ఉంటే బాధ పడేదానిని కాదు. ఎలాగైనా నాకు పింఛను ఇప్పించండి." - వృద్ధురాలు

'పింఛనే దిక్కు.. తొలగిస్తే బతికేది ఎలా'

ఇవీ చదవండి: 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్దమా'.. హరీశ్​రావుకు ప్రభాకర్​ సవాల్

'ఉక్రెయిన్​తో రష్యా వ్యవహరించినట్టుగా.. భారత్​తో చైనా వైఖరి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.