బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కోరారు. ఉద్యోగాల భర్తీ కోరుతూ భాగ్యనగరంలోని అశోక్‌నగర్ నగర కేంద్ర గ్రంథాలయం వద్ద పీవైఎల్, పీడీఎస్‌యూ నిరసన చేపట్టాయి. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో... ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందన్నారు.
ఖాళీల భర్తీలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వీడాలని సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో పాలకవర్గాలు ఘోరంగా విఫలమయ్యాయని పీడీఎస్‌యూ విమర్శించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యపై చర్చించకుండా సమావేశాలు ముగిస్తే భారీగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది.
ఇదీ చూడండి: దిల్లీ ఘర్షణలపై గందరగోళం... రాజ్యసభ రేపటికి వాయిదా