ETV Bharat / state

ఆరో విడత హరితహారం కోసం సర్వం సిద్ధం చేయాలి: పీసీసీఎఫ్​ - హరితహారం తాజా వార్తలు

వచ్చే నెల జూన్‌ 20 నుంచి ప్రారంభమయ్యే ఆరో విడత హరితహారం కోసం అటవీ శాఖ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేాయలని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్.శోభ.. అధికారులను ఆదేశించారు. అవసరం మేరకు పెద్ద మొక్కలు సరఫరా చేయాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరో విడత హరితహారం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో హైదరాబాద్​ అరణ్యభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆరో విడత హరితహారం కోసం సర్వం సిద్ధం చేయాలి: పీసీసీఎఫ్​

author img

By

Published : May 16, 2020, 7:30 PM IST

వచ్చే నెల జూన్‌ 20 నుంచి ప్రారంభమయ్యే ఆరో విడత హరితహారం కోసం అటవీ శాఖ వివిధ రకాల మొక్కలను సిద్ధం చేస్తోంది. హరితహారం సన్నాహకాలు, నర్సరీల్లో పరిస్థితిపై అన్ని జిల్లాల అటవీశాఖాధికారులతో పీసీసీఎఫ్‌ ఆర్​.శోభ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వెంటనే అన్ని నర్సరీల్లో ఉన్న మొక్కలను మదింపు చేయాలని, చెట్ల రకాలు, ఎత్తు ఆధారంగా సరఫరాకు సిద్దం చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాల వారీగా నాటాల్సిన మొక్కల లక్ష్యాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ నిర్ణయించిందని.. జిల్లా అటవీ అధికారి నోడల్ అధికారిగా కార్యక్రమం సమన్వయం చేయాలన్నారు.

"జిల్లాల వారీగా లభ్యమయ్యే మొక్కల వివరాలతో నర్సరీ డైరెక్టరీని సిద్ధం చేయాలి. గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం పల్లె ప్రగతిలో భాగంగా గ్రామీణాభివృద్ది శాఖ నిర్వహిస్తుంది. సాంకేతిక సహకారం అటవీ శాఖ సిబ్బందే అందించాలి. మున్సిపాలిటీలు, పట్టణాల్లో పెద్ద మొక్కల అవసరం ఎక్కువగా ఉంటుంది. వాటిని తగిన సంఖ్యలో సరఫరా చేసే బాధ్యత ఆయా జిల్లా అటవీ అధికారులు పర్యవేక్షించాలి. అటవీ శాఖ సిబ్బంది పనితీరుకు ముఖచిత్రంగా నిలుస్తున్న రహదారి వనాలపై (అవెన్యూ ప్లాంటేషన్) ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. వివిధ ప్రాజెక్టుల కోసం మళ్లించిన అటవీ భూములకు బదులుగా తీసుకున్న రెవెన్యూ భూములను వెంటనే రిజర్వ్ ఫారెస్ట్ లేదా రక్షిత అటవీ ప్రాంతాలుగా నోటిఫికేషన్ జారీ చేయాలి. అదే సమయంలో అనుమతుల జారీలో ఉన్న నియమాలన్నీ కచ్చితంగా పాటించేలా చూడాలి."

-ఆర్​. శోభ, రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారి

వర్షాకాలం సమీపిస్తున్నందున అటవీ భూములను ఆక్రమించే కొత్త ప్రయత్నాలు జరగొచ్చని.. అన్ని బీట్లలో నిత్య పర్యవేక్షణ ఉండాలని శోభ సూచించారు. లాక్ డౌన్ ప్రభావం వల్ల జంతువులు బాహ్య ప్రపంచలోకి వస్తున్నాయని.. ఇలాంటి సందర్భాల్లో రెస్క్యూ ఆపరేషన్ అత్యంత జాగ్రత్తగా చేయాలన్నారు. వీలైనంత వరకు జంతువులు అటవీ ప్రాంతాల్లోకి తిరిగివెళ్లేలా చూడాలన్నారు.

ఇవీ చూడండి: బీర్లను నేలపాలు చేసిన ఎక్సైజ్ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.