Revanth Reddy spoke on alliances in TS : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పొత్తులపై నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చినా అహ్వానిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో పొత్తులపై పూర్తిగా చర్చిస్తారని తెలియజేశారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకునే వారికి, టికెట్ దక్కాలన్న సర్వేనే ప్రామాణికం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. పాత్రికేయులు పొత్తుల గురించి అడగగా.. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ అక్రమాలు చేస్తుందని.. వాటిని ప్రజలకు తెలియజేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
BRS, BJP రెండు ఒకటే : పొత్తుల విషయం ఎన్నికల సమయంలోనే చర్చిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని చెప్పారు. కొన్నిసార్లు తెర వెనుక ఉంటాయి. మరికొన్నిసార్లు బహిరంగంగానే ఆ విషయం స్పష్టమవుతుందని అన్నారు. దిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అధికారం విషయంలో.. ఎన్నికైన గవర్నర్‌కి అధికారాలు ఉంటాయని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని.. దీనిపై బీజేపీ లెప్టినెంట్ గవర్నర్‌కే అధికారాలు ఇచ్చేలా ఆర్డినెన్స్ తీసుకు వస్తుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎందుకు బీజేపీని వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని.. బీఆర్ఎస్ ఎప్పుడు మోదీతోనే కలసి ఉంటుందని ఆరోపించారు.
బీజేపీ నాయకులు ఎందుకు స్పందించ లేదు : ఓఆర్ఆర్ విషయంలో జరుగుతున్న అక్రమాలు గురించి మాట్లాడారు. ఈ విషయంలో బీజేపీ ప్రముఖ నాయకులైన బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నంచారు. కేంద్రం నుంచి ఈ విషయంలో దర్యాప్తు చేసేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు చేయంలేదని అడిగారు. ఈ విధంగానే ఆ రెండు పార్టీలు ఒకటేనని తెలిపారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి పొత్తుల విషయంలో స్పందించారు. తాను పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నంత కాలం బీఆర్ఎస్తో పొత్తుకు వెళ్లమని స్పష్టం చేశారు. దీంతో పాటు పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ తనకి ఎందుకు కలిసే అవకాశం ఇవ్వలేదనే విషయం గురించి చర్చించారు.
"బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే ఒక్కోసారి తెర వెనకాల ఉంటాయి. మరోసారి బహిరంగంగానే ఉంటాయి. దిల్లీ లెప్టినెంట్ విషయంలో అదే జరిగింది. ఆ విషయంలో బీజేపీపై బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించలేదు. ఆ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి."- రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి :