ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచించాలని ... కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరినట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రజల మనోభావాలకు చెందిన అంశమని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఏపీ సీఎం కేంద్రానికి లేఖ రాస్తే సరిపోదని.. 22 మంది ఎంపీలున్న పార్టీ దిల్లీలో పోరాటం చేయాలన్నారు. మార్చి 3, 4 అమిత్ షా తిరుపతి పర్యటన ఉందని తెలిపారు. తిరుపతి ఉపఎన్నిక, భాజపా-జనసేనల భవిష్యత్ కార్యాచరణపై మార్చి 3, 4 తేదీల్లో ఆయనతో చర్చిస్తామని పవన్ వెల్లడించారు. భాజపాతో కలిసి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ..
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయొద్దంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి దిల్లీలోని కిషన్‌రెడ్డి కార్యాలయానికి పవన్ వెళ్లారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సహా.. ఏపీలోని సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సహకారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'తెలంగాణపై అవగాహన లేని వారు వచ్చి విమర్శలు చేస్తున్నారు'