విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం ఏర్పడనుంది. ట్రాన్స్‌కో మల్లెపల్లి ఫీడర్‌లో తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల గొండకొండ్లలోని జలమండలి పంపింగ్ స్టేషన్‌లో రెండు దఫాల్లో దాదాపు మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా కృష్ణా ఫేజ్ 1, 2, 3ల ద్వారా మంచినీటి తరలింపులో ఇబ్బందులు ఏర్పడినట్లు జలమండలి అధికారులు తెలిపారు.
గోషామహల్, రియాసత్‌నగర్, నవోదయ కాలనీ, రెడ్‌హిల్స్, నారాయణగూడ, మారేడ్‌పల్లి, సాహెబ్‌నగర్, బీరప్పగూడ, రాజేంద్రనగర్, ఎస్.ఆర్.నగర్, హఫీజ్‌పేట్ డివిజన్‌లలో పాక్షిక అంతరాయం కలుగుతుందని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్న అధికారులు.. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఇదీచూడండి: కేటీఆర్‌కు అరుదైన గౌరవం.. వర్చువల్ సదస్సుకు ఆహ్వానం..