హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి పార్కులో విధులు నిర్వహిస్తున్న రాములు అనే కాపలాదారుపై... పార్కు గేటు విరిగిపడింది.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతను మృతి చెందాడు. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ రాములు బంధువులు ఆందోళనకు దిగారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వెంకటగిరి పార్కులో గతంలో కూడా ఈ తరహా ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. అయిన్నపటికీ అధికారులు గేటుకు మరమ్మత్తులు చేయించలేదని వివరించారు. ఈ కారణంగానే అకస్మాత్తుగా గేటు విరిగిపడి కాపలాదారుడు మృతి చెందాడన్నారు. రాములు కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు రాములు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు