పల్లెలకు కొత్త కళ తీసుకొచ్చేందుకే రాష్ట్రప్రభుత్వం 30 రోజుల ప్రణాళిక చేపట్టినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులను ధృడ సంకల్పంతో పూర్తి చేసిన సీఎం కేసీఆర్ అదే చిత్తశుద్ధితో గ్రామాల రూపురేఖలు మారుస్తారని అన్నారు. సర్పంచ్లకు పూర్తి అధికారాలు ఇచ్చామని... గ్రామాల అభివృద్ధికి నిధులు కూడా కేటాయించామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పల్లెల అభివృద్ధికై గ్రామస్థులను భాగస్వామ్యం చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. పల్లెలను ప్రగతి పథంలో నడిపేందుకు కేసీఆర్ చేపట్టిన కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందంటోన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో ఈటీవీభారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి : యూరియా విషయంలో రాజకీయాలొద్దు: మంత్రి నిరంజన్ రెడ్డి